Elon Musk : అపర కుబేరుడు, వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్‌కు సంబంధించిన కీలకమైన టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘‘మస్క్ అమెరికా అధ్యక్షుడు కాగలరా ?’’ అని కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించగా ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చారు. ఎలాన్ మస్క్ అమెరికా ప్రెసిడెంట్ కాలేరని ట్రంప్ స్పష్టం చేశారు. మస్క్ ఎందుకు అమెరికా అధ్యక్షుడు కాలేరనే విషయాన్ని ట్రంప్ వివరించారు. ఆరిజోనా రాష్ట్రంలో ఏర్పాటుచేసిన రిపబ్లికన్ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన దీనిపై మాట్లాడారు.
Also Read :Bank Loans Evasion : బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టిన తెలుగు రాష్ట్రాల కంపెనీలివే
‘‘ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు కాలేరు. ఎందుకంటే.. ఆయన అమెరికాలో పుట్టలేదు. దక్షిణాఫ్రికాలో పుట్టారు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే వ్యక్తి అమెరికాలోనే జన్మించి ఉండాలని దేశ రాజ్యాంగం చెబుతోంది’’ అని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ వెంటనే స్పందించారు. ‘అద్భుతం’ అని తన ఎక్స్ అకౌంటులో రాశారు. ప్రస్తుతం వీరిద్దరి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ప్రెసిడెంట్ మస్క్’ అంటూ డెమొక్రటిక్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు, మస్క్(Elon Musk) రిప్లై ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
Also Read :Plane Crash : ఇళ్లలోకి దూసుకెళ్లిన విమానం.. 10 మంది మృతి.. 17 మందికి గాయాలు
ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎలాన్ మస్క్ అన్ని రకాల సహాయ సహకారాలను అందించారు. ఎన్నికల ప్రచారం కోసం వేల కోట్ల విరాళాలు అందించి ట్రంప్‌ను ఆర్థికంగా ఆదుకున్నారు. తన సోషల్ మీడియా కంపెనీ ఎక్స్ ద్వారా ట్రంప్‌కు అద్భుతమైన రీచ్ వచ్చేలా మస్క్ చేశారు. ఎన్నికల వ్యూహ రచనలో ట్రంప్‌కు సాయం చేశారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలించి ఎన్నికల్లో ట్రంప్ విజయ ఢంకా మోగించారు. అందుకే ఎలాన్ మస్క్ కోసం ప్రత్యేకమైన పదవిని ట్రంప్ క్రియేట్ చేశారు. అమెరికా ప్రభుత్వంలో జరిగే అనవసర వ్యయాలను గుర్తించి, వాటికి కోత పెట్టేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(DOGE) అనే విభాగాన్ని ట్రంప్ కొత్తగా క్రియేట్ చేశారు. దీనికి సారథిగా ఎలాన్ మస్క్‌ను నియమించారు.