France: నేపాల్‌లో జెన్-జీ నిరసనల కారణంగా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రాన్స్‌లోనూ (France) ప్రభుత్వంపై భారీ స్థాయిలో నిరసనలు మొదలయ్యాయి. దేశంలో పెరుగుతున్న అరాచకం, పార్లమెంటులో అస్థిరత కారణంగా దేశవ్యాప్తంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నిరసనకు ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ అని పేరు పెట్టారు.
ప్యారిస్‌లో 200 మందికి పైగా అరెస్టు
తాజా సమాచారం ప్రకారం.. ఈ నిరసనల్లో ఇప్పటివరకు 200 మందికి పైగా అల్లరిమూకలను అరెస్టు చేశారు. ఈ ఆందోళనల కారణంగా దేశ రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ముఖాలకు మాస్కులు ధరించిన ఆందోళనకారులు చెత్త డబ్బాలు, బారికేడ్లను అడ్డుపెట్టి రోడ్లను దిగ్బంధించారు. మార్సెల్ వంటి నగరాల్లోనూ అల్లరిమూకలు ప్రధాన కూడళ్లను దిగ్బంధించి పోలీసులపై సీసాలు విసిరారు. రాజధానిలోని రైల్వే స్టేషన్‌ను కూడా నిరసనకారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Also Read: Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు
పోలీసుల వివరణ
అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది పబ్లిక్ ఆర్డర్‌ను పాటించనివారేనని ఫ్రెంచ్ పోలీసులు తెలిపారు. అయితే రోజులు గడిచేకొద్దీ నిరసనకారుల సంఖ్య పెరిగి, పరిస్థితి మరింత హింసాత్మకంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కేవలం 24 గంటల్లో కొత్త ప్రధానమంత్రి అవసరమైన ఈ సమయంలో ఈ ఆందోళనలు జరుగుతున్నాయని పోలీసులు అన్నారు.
80,000 మంది పోలీసు బలగాల మోహరింపు అవిశ్వాసం కారణంగా పదవి కోల్పోయిన మాజీ ప్రధాని స్థానంలో ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకార్ను కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఫ్రాన్స్ ప్రభుత్వంపై రుణ భారం పెరిగిపోతుండటం ఈ నిరసనలకు ప్రధాన కారణం. మాజీ ప్రధాని అప్పుల పరిష్కారానికి ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు తిరస్కరించడంతో దేశంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి ప్రభుత్వం 80,000 మందికి పైగా భద్రతా బలగాలను మోహరించింది.