Bill Gates – Kamala : అమెరికా ఎన్నికల్లో అపర కుబేరుల హవా నడుస్తోంది. వారి నుంచి విరాళాలను సేకరించేందుకు అధికార డెమొక్రటిక్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఎందుకంటే సాధ్యమైనంత ఎక్కువ మంది సంపన్నులను తమ వైపు తిప్పుకునే రాజకీయ పార్టీనే విజయం వరించే అవకాశాలు ఉంటాయి. ఎంత ఎక్కువగా విరాళాలు వస్తే.. అంత ఎక్కువగా ప్రచారం చేయగలుగుతారు. ఎన్నికల ప్రచారం ఎంత ఎక్కువగా చేస్తే.. అంత ఎక్కువ మంది ఓటర్ల చూపును ఆకట్టుకోగలుగుతారు. తాజాగా ఈ విరాళాల లిస్టులోకి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ చేరారు. ఈయన డెమొక్రటిక్ పార్టీకి భారీ విరాళం ప్రకటించారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున భారత సంతతి వనిత, ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో డెమొక్రటిక్ పార్టీకి బిల్‌గేట్స్ ఏకంగా రూ.420 కోట్ల విరాళాన్ని అందించారు. కమలాహారిస్‌కు (Bill Gates – Kamala) మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ‘ఫ్యూచర్ ఫార్వర్డ్’ అనే స్వచ్ఛంద సంస్థకు ఈ విరాళాన్ని గేట్స్ సమకూర్చారు.
Also Read :Cyclone Dana : ముంచుకొస్తున్న ‘దానా’.. ఒడిశా, బెంగాల్‌లలో 10 లక్షల మంది తరలింపు
నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈసారి జరుగుతున్న ఎన్నికలపై బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులతో కలిసి పనిచేసిన సుదీర్ఘ అనుభవం తనకు ఉందన్న గేట్స్.. ఈసారి జరుగుతున్న ఎన్నికలు చాలా భిన్నమైనవని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణంలో మార్పులు తెచ్చేందుకు కృషి చేసేవారికి తన మద్దతు ఉంటుందన్నారు.
Also Read :Rose Water Benefits : రోజ్ వాటర్ శీతాకాలంలో ఈ సమస్యల నుండి చర్మాన్ని కాపాడుతుంది..!
న్యూహాంప్‌షైర్‌లోని కాంకార్డ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కామెంట్ చేశారు. రాజకీయంగా ట్రంప్‌ను లాక్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కమలాహారిస్‌ను ట్రంప్ ఓడిస్తే అమెరికా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని చెప్పారు. ‘లాక్ హిమ్ అవుట్’ అని బైడెన్ నినాదాలు చేశారు.