US Elections 2024 : ఇప్పుడు యావత్ ప్రపంచం చూపు అమెరికా అధ్యక్ష ఎన్నికల వైపే ఉంది. రేపు (నవంబరు 5న) అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇందుకోసం వివిధ భాషల్లో బ్యాలెట్లను ముద్రించారు. న్యూయార్క్ రాష్ట్రం విషయానికి వస్తే.. ఆంగ్ల భాషకు అదనంగా మరో ఐదు భాషల్లో ఎన్నికల బ్యాలెట్లను ప్రింట్ చేశారు. ఆ భాషల లిస్టులో మన భారత దేశానికి చెందిన ఒక భాషకు కూడా చోటు దక్కింది. అదే.. బెంగాలీ భాష. దీనితో పాటు చైనీస్, స్పానిష్, కొరియన్ భాషల్లో కూడా బ్యాలెట్లను(US Elections 2024) ముద్రించారు. ఈవివరాలను న్యూయార్క్ రాష్ట్ర ఎన్నికల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జే రియాన్ వెల్లడించారు. భారత్‌లో అనేక భాషలు ఉన్నాయి.
Also Read :MLC by election : ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ బైపోల్ షెడ్యూల్ విడుదల
అయితే గతంలో కోర్టులో వేసిన ఓ దావా వల్ల అమెరికా ఎన్నికల బ్యాలెట్లలో బెంగాలీ భాషకు చోటు లభించింది. అమెరికాలో ఎన్నికల నిర్వహణ పద్ధతి భిన్నంగా ఉంటుంది. భారత్ సహా చాలా ప్రపంచ దేశాల్లో ఏకీకృత ఎన్నికల వ్యవస్థ అమల్లో ఉంది. బ్యాలెట్ పేపర్లలో వినియోగించే భాష భారత్ లాంటి దేశాల్లో అంతటా ఒకే విధంగా ఉంటుంది. అయితే అమెరికాలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఎక్కువ.
Also Read :TTD : ‘వక్ఫ్ బోర్డు’ రియల్ ఎస్టేట్ కంపెనీ.. ఒవైసీ వ్యాఖ్యలకు టీటీడీ చీఫ్ కౌంటర్
కేవలం ఎన్నికల ప్రచార అంశాలను అమెరికా కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. మిగతా వ్యవహారాలన్నీ రాష్ట్రాలు చూసుకుంటాయి. ప్రతీ రాష్ట్రం దేనికి అదిగా.. ఎన్నికల నిర్వహణ విధానాలను అమలు చేస్తాయి.ఈక్రమంలోనే న్యూయార్క్ రాష్ట్రం బ్యాలెట్ పేపర్లలో బెంగాలీ భాషకు కూడా చోటు ఇవ్వాలని నిర్ణయించింది. పోలింగ్ సమయం, కౌంటింగ్ ప్రక్రియ వంటి అంశాల్లోనూ అమెరికాలోని రాష్ట్రాలు తీరొక్క నిబంధనలను అమలు చేస్తుంటాయి.