హైదరాబాద్ వేదికగా నిర్వహించిన 72వ మిస్ వరల్డ్-2025 ( Miss World 2025) పోటీలో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ (Opal Suchata Chuangsri) విజేతగా నిలిచింది. 108 దేశాలకు చెందిన అందగత్తెలతో పోటీ పడి తన సౌందర్యం, మేధస్సు, సామాజిక సేవ పట్ల ఉన్న తపనతో ప్రపంచ కిరీటాన్ని పొందింది. గతేడాది విజేత క్రిస్టినా పిజ్‌కోవా చేతుల మీదుగా సుచాత కిరీటాన్ని అందుకుంది. విజేతగా నిలిచిన ఆమెకు రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీతో పాటు వజ్రాలతో పొదిగిన విలువైన కిరీటంతో అంతర్జాతీయ ఖ్యాతి లభించింది.
Female Fan: నా భర్తకు విడాకులు ఇస్తా.. ఆర్సీబీపై భారం వేసిన లేడీ ఫ్యాన్!
మిస్ వరల్డ్ కిరీటం ధరించిన తర్వాత ఓపల్ సుచాత జీవితమే మారిపోయింది. ఏడాది పాటు ఆమె లగ్జరీ లైఫ్ గడపనుంది. ప్రొఫెషనల్ డిజైనర్లు, స్టైలిస్టులు, న్యూట్రిషనిస్టులు ఆమెకు ప్రత్యేక సేవలందించనున్నారు. ఖరీదైన డ్రెస్సులు, మేకప్ కిట్లు, ఆభరణాలు ఆమెకు ఉచితంగా లభిస్తాయి. అంతేకాకుండా మిస్ వరల్డ్ అనే గౌరవంతో ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేయడానికి అవకాశాలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యతలు కూడా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన బ్రాండ్లకు అంబాసిడర్‌గా నిలిచే అవకాశాన్ని కూడా సుచాత పొందనుంది.
Tiffin: ఉదయాన్నే ఏ సమయంలోపు టిఫిన్ చేస్తే మంచిది?
సుచాతకు లభించిన వజ్రాల కిరీటం విలువ సుమారు రూ. 85 లక్షలు. ఇది తాత్కాలికంగా ఆమెకు అప్పగించబడుతుంది. వచ్చే ఏడాది మిస్ వరల్డ్ పోటీల్లో కొత్త విజేతకు అదే కిరీటం ఆమె చేతుల మీదుగా ధరిస్తారు. కాబట్టి విజేతకు ఈ కిరీటం పదిలంగా ఉంచే బాధ్యత ఉంటుంది. కిరీటానికి ప్రతిరూపంగా తయారుచేసిన మోడల్‌ను మాత్రం ఆమెకు శాశ్వతంగా ఇచ్చారు. సో ఇక నుండి ఓపల్ సుచాత జీవితమే మారనుంది.