Site icon HashtagU Telugu

Barack Obama: భార్య మిచెల్ ఒబామాతో విడాకుల పుకార్లు.. అస‌లు విష‌యం చెప్పిన ఒరాక్ ఒబామా

Former Us President Barack Obama And Michelle Obama

Former Us President Barack Obama And Michelle Obama

Barack Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా త‌న భార్య మిచెల్ ఒబామా మధ్య విడాకుల పుకార్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఒబామా తన భార్య లేకుండానే పాల్గొన్నారు. దీంతో పుకార్ల‌కు బ‌లంచేకూరిన‌ట్ల‌యింది. అయితే, తాజాగా ఈ విష‌యంపై ఒరాక్ ఒబామా క్లారిటీ ఇచ్చారు. అమెరికాలోని హామిల్టన్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా.. అమెరికా అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో త‌మ దాంప‌త్య జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్ర‌స్తుతం ఒడిదుడుకుల గురించి వివ‌రించారు.

Also Read: Obama : ట్రంప్‌ టారిఫ్‌లు అమెరికాకు మేలు చేస్తాయని నేను భావించడం లేదు : ఒబామా

అమెరికా మాజీ దేశాధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా వైట్‌హౌజ్‌లో ఉన్న స‌మ‌యంలో.. వైవాహిక బంధంలో ఒడిదొడుకుల‌ను ఎదుర్కొన్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. అందుకే ఇప్పుడు త‌న భార్య మిచెల్ ఒబామాతో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్న‌ట్లు చెప్పారు. రెండు ప‌ర్యాయాలు దేశాధ్య‌క్ష హోదాలో ఉండ‌డం వ‌ల్ల‌.. భార్య మిచెల్ ఒబామాతో రిలేష‌న్ దెబ్బ‌తిన్న‌ట్లు ఒబామా తెలిపారు. భార్య మిచెల్‌తో బంధంలో తీవ్ర లోటు ఏర్ప‌డిన‌ట్లు చెప్పారు. అయితే, అప్పుడు ఏర్ప‌డిన అగాధాన్ని ఇప్పుడు చిన్నచిన్న స‌ర‌దాల‌తో తీర్చుకుంటున్న‌ట్లు చెప్పాడు.

Also Read: WhatsApp New Feature: వాట్సాప్‌లో మీరు పంపే ఫైళ్లు సేవ్ కావొద్దా ? ఇదిగో ఫీచర్

ఒబామా దంపతులు త‌మ దాంప‌త్య జీవితంలో ఇబ్బందుల గురించి మాట్లాడ‌టం ఇదే మొదటిసారి కాదు. 2022లో ఒక ఇంటర్వ్యూలో మిచెల్ ఒబామా తన వివాహ జీవితంలో ప‌ది సంవత్సరాలు బరాక్‌తో క‌లిసి ఉండ‌టానికి ఇబ్బంది ప‌డ్డాన‌ని బహిరంగంగా అంగీకరించారు. తాజాగా.. ఒబామా మాట్లాడుతూ.. తాను అధ్యక్ష పదవిలోని బిజీగా ఉండటం, ఒత్తిడి తన వివాహ‌బంధాన్ని దెబ్బతీశాయని అంగీకరించారు.

తాను ఇప్పటికీ మిచెల్ కు చాలా రుణ‌ప‌డి ఉన్నానని, దానిని తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. నేను అధ్యక్షుడైన తర్వాత నాకు, మిచెల్ కు మధ్య ఏర్పడిన లోతైన అంతరాన్ని అధిగమించడానికి నేను ఇప్పటికీ ప్రయత్నిస్తున్నానని  బరాక్ ఒబామా అన్నారు. ఒబామా, మిచెల్ వివాహం 1992లో జ‌రిగింది. వారికి ఇద్ద‌రు కూతుళ్లు. వారిపేర్లు సాషా, మాలియా.