Chinmoy Krishna Das : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల అంశం సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది. అక్కడి హిందూ వర్గానికి మద్దతుగా గళం వినిపిస్తున్న ఇస్కాన్ సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్(Chinmoy Krishna Das)ను ఏకాకిగా చేసి వేధించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్న చిన్మయ్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు లాయర్లు ఎవరూ ముందుకురావడం లేదని తెలుస్తోంది. దీంతో బెయిల్‌పై విచారణను బంగ్లాదేశ్ కోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.
Also Read :Harbhajan Singh : పాకిస్థాన్‌కు ఇష్టం లేకపోతే భారత్‌కు అస్సలు రావొద్దు.. మాకేం బాధలేదు
చిన్మయ్ కృష్ణదాస్ తరఫున వాదించేందుకు ముందుకొచ్చిన ఓ లాయర్‌పై ఆందోళనకారులు తీవ్రంగా దాడి చేశారు. దీంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సదరు లాయర్ ఇంటిపైనా దుండగులు ఎటాక్ చేయడం గమనార్హం. చిన్మయ్ కృష్ణదాస్ కేసును వాదించేందుకు రవీంద్ర ఘోష్ అనే లాయర్ ముందుకు వచ్చారు. ఆయన ఏకంగా దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించి కోర్టుకు వచ్చారు. అయితే స్థానికులు ఆ లాయర్‌ను కూడా కోర్టు ప్రాంగణంలోకి వెళ్లనివ్వలేదు.
Also Read :Basavatarakam Cancer Hospital: అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి.. శంకుస్థాపన ఎప్పుడంటే?
గతనెలలో బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రాంలో జరిగిన ఇస్కాన్ ర్యాలీలో చిన్మయ్ కృష్ణదాస్ ప్రసంగించారు. హిందువుల పరిరక్షణకు చర్యలు చేపట్టడంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈక్రమంలో ఆ నగరంలోని ఒక స్తంభానికి ఉన్నబంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎక్కువ ఎత్తులో కాషాయ జెండాను కొందరు యువకులు కట్టారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఛటోగ్రాంలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన పలువురిపై పోలీసులు దేశ ద్రోహం కేసులు నమోదు చేశారు. చిన్మయ్ కృష్ణదాస్‌పైనా ఈ కేసు నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ కార్యకలాపాలపై బ్యాన్ విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఓ కోర్టు కొట్టివేసింది. అయితే ఇస్కాన్‌తో సంబంధమున్న దాదాపు 17 బ్యాంకు ఖాతాలను బంగ్లాదేశ్ అధికార వర్గాలు సీజ్ చేశాయి.