Site icon HashtagU Telugu

Sheikh Hasina : హసీనా వల్లే 3,500 మర్డర్స్.. బంగ్లాదేశ్ సర్కారు సంచలన అభియోగాలు

Sheikh Hasina enforced disappearances

Sheikh Hasina : 3,500 మంది అనుమానాస్పద హత్యల వెనుక మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా హస్తం ఉందని  బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు కమిషన్ ఛైర్మన్‌ మొయినుల్ ఇస్లాం చౌదరి ఆరోపించారు.  హసీనా(Sheikh Hasina) హయాంలో ఎంతోమంది ప్రభుత్వ అధికారుల కిడ్నాప్‌లు, హత్యలు జరిగాయని.. వాటిలో చాలావరకు హసీనా ఆదేశాల మేరకే జరిగినట్లు గుర్తించామన్నారు. ఈ హత్యలను చేయించేందుకు పోలీసుల యాంటీ క్రైమ్ విభాగం ‘ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్’‌‌ను హసీనా వాడుకున్నారని ఆయన తెలిపారు. ఎవరికీ ఆధారాలు దొరకకుండా కొందరు అధికారులను మాయం చేయించడంలో ఆ బెటాలియన్‌లోని సిబ్బంది పాత్ర ఉందని మొయినుల్ ఇస్లాం చౌదరి పేర్కొన్నారు. ‘‘హసీనా హయాంలో ఒక పక్కా ప్లాన్ ప్రకారం అధికారులను కిడ్నాప్ చేయించి, హత్యలు చేశారు. ఈ హత్యలన్నీ దాదాపు  ఒకే ఫార్మాట్‌లో జరిగాయి. హత్యలకు ముందు అధికారులను టార్చర్ చేశారు’’ అని ఆయన తెలిపారు. ఇన్ని దారుణాలలో భాగమైనందుకు  ‘ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్’‌‌ను రద్దు చేయాలని  బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి దర్యాప్తు కమిషన్ ఛైర్మన్ సిఫారసు చేశారు.

Also Read :Fact Check : రూ.2వేల కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై ట్యాక్స్ ? నిజం ఇదీ

ఈ హత్యలు, కిడ్నాప్ వ్యవహారాల్లో రిటైర్డ్ సైనికాధికారి తారిఖ్ అహ్మద్ సిద్దీఖ్ , మాజీ టెలికమ్యూనికేషన్ విభాగం అధిపతి జియావుల్ అహసన్, పోలీసు అధికారులు మునీరుల్ ఇస్లాం, మహ్మద్ హారూనుర్ రషీద్‌ల పాత్ర కూడా ఉందని దర్యాప్తు కమిషన్ ఛైర్మన్ మొయినుల్ ఇస్లాం చెప్పారు. ప్రస్తుతం వీరు పరారీలోనే ఉన్నారని తెలిపారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి ఆగస్టు 5న పరారయ్యారు.  దీంతో ఈ హత్యల్లో పాత్ర ఉన్నవాళ్లు కూడా ఫారిన్‌కు పారిపోయారు.  వారందరిపైనా కేసులు నమోదు చేసి బంగ్లాదేశ్ దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. వారి ఆచూకీని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. విదేశాల నుంచి వారిని బంగ్లాదేశ్‌కు రప్పించే అంశంపైనా వ్యూహరచన జరుగుతోంది.

Also Read :Billionaires Free Time : లీజర్ టైం దొరికితే.. ఈ బిలియనీర్లు ఏం చేస్తారో తెలుసా ?