Site icon HashtagU Telugu

Fuel Tanker Collides With Truck : 48 మంది సజీవ దహనం.. ట్రక్కు, ఆయిల్ ట్యాంకర్ ఢీ

Fuel Tanker Collides With Truck Nigeria Explosion

Fuel Tanker Collides With Truck : నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర – మధ్య నైజర్ రాష్ట్రంలోని అగాయ్ ప్రాంతంలో ఓ ట్రక్కును ఆయిల్ ట్యాంకర్(Fuel Tanker Collides With Truck) ఢీకొంది. దీంతో చోటుచేసుకున్న భారీ పేలుడులో దాదాపు 48 మంది సజీవ దహనమయ్యారు.  వారందరికీ సామూహిక ఖననం నిర్వహించారు.  ఆ ప్రాంతంలో ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ఉన్న దాదాపు 50 పశువులు కూడా సజీవ దహనం కావడం గమనార్హం.

Also Read :International Literacy Day : ప్రపంచంలో అత్యల్ప అక్షరాస్యత కలిగిన దేశాలు..!

నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా అరబ్ ఈ వివరాలను వెల్లడించారు. నైజీరియాలో  సరుకు రవాణా చేయడానికి సరైన రైల్వే వ్యవస్థ లేదు. అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో రోడ్లపై ట్రక్కు ప్రమాదాలు సర్వసాధారణం. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ నివేదిక ప్రకారం..  2020 సంవత్సరంలో 1,531 గ్యాసోలిన్ ట్యాంకర్ ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాల్లో 535 మంది చనిపోగా, 1,142 మంది గాయపడ్డారు.

జోర్డాన్ – పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ సరిహద్దుల్లో ఓ సాయుధుడు  జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయెలీలు చనిపోయారు.  కాల్పులు జరిపిన వ్యక్తిని జోర్డాన్ వాస్తవ్యుడిగా గుర్తించారు. అతడి పేరు  మహెర్ జాజీ (39) అని వెల్లడించారు. ఇజ్రాయెలీ దళాల ప్రతి కాల్పుల్లో అతు చనిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జోర్డాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత ఏరియాలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. జోర్డాన్‌కు చెందిన ఓ వాహనం సరుకుల లోడ్‌తో వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోకి ప్రవేశిస్తుండగా ఈ ఘటన జరిగిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి జోర్దాన్ – వెస్ట్ బ్యాంక్ సరిహద్దు పాయింట్‌ను ఇజ్రాయెల్ దళాలు మూసివేశాయి. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని ఇజ్రాయెలీ ఆర్మీ సేకరించింది.  వాస్తవానికి చాలా ఏళ్లుగా జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య మంచి వాణిజ్య, దౌత్యపరమైన సంబంధాలు ఉన్నాయి. ప్రతిరోజూ జోర్డాన్ నుంచి వెస్ట్ బ్యాంకు, ఇజ్రాయెల్‌కు డజన్ల కొద్దీ ట్రక్కులు రాకపోకలు సాగిస్తుంటాయి.

Also Read :Brain Cancer : మొబైల్ ఫోన్లు వాడటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా.?