Iran Blast : మిథేన్ గ్యాస్ లీక్ కావడంతో బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఇరాన్‌లోని తబాసలో ఉన్న బొగ్గు గనిలో సంభవించిన ఈ ఘటనలో 30 మంది కార్మికులు చనిపోయారు. మరో 24 మంది శిథిలాల కింద(Iran Blast) చిక్కుకున్నారు. వారిలో 28 మందిని రక్షించారు. క్షతగాత్రులకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. పేలుడు జరిగిన సమయానికి గనిలో దాదాపు 69 కార్మికులు ఉన్నారు.
Also Read :Indian Antiquities : అమెరికా పెద్ద మనసు.. 297 భారత పురాతన వస్తువులు బ్యాక్
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన సాయం చేయాలని అధికార వర్గాలను ఆదేశించారు. ఇరాన్‌లోని బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరగడం ఇదే ఫస్ట్ టైం కాదు. 2013లో జరిగిన బొగ్గుగని ప్రమాదంలో 11 మంది, 2009లో జరిగిన ప్రమాదంలో 20 మంది చనిపోయారు. 2017లో జరిగిన బొగ్గుగని పేలుడులో 42 మంది చనిపోయారు.
Also Read :Sri Lanka Elections : శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే ముందంజ.. ఆయన ఎవరు ?
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ కొత్త డ్రోన్
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో సరికొత్త క్షిపణి, డ్రోన్‌లను ఇరాన్ ఆవిష్కరించింది. క్షిపణి పేరు జిహాద్, డ్రోన్ పేరు షహీద్-136బీ. ఇటీవలే నిర్వహించిన సైనిక పరేడ్‌లో వీటిని ప్రదర్శించారు. జిహాద్ మిస్సైల్ పరిధి 1000 కిలోమీటర్లు. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌కు దాదాపు 2,500 కి.మీ మించిన దూరమే ఉంటుంది. అంటే ఇజ్రాయెల్‌పై ప్రయోగించడానికి ఇది పనికిరాదు. సమీపంలోని లక్ష్యాలను ఛేదించడానికి దీన్ని ఇరాన్ వాడుకోగలుగుతుంది. ఇక షహీద్-136బీ డ్రోన్ పరిధి 4000 కిలోమీటర్లు. దీన్ని ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ ప్రయోగించగలుగుతుంది. ఇజ్రాయెల్‌ను ఫోకస్‌లో ఉంచుకొని ఈ డ్రోన్‌ను ఇరాన్ డెవలప్ చేసిందని అంటున్నారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మిస్సైళ్లు, డ్రోన్లను సొంతంగా తయారు చేయగలిగిన కీలక దేశంగా ఇరాన్ అవతరించింది. ఇరాన్ నుంచే పాలస్తీనాలోని హమాస్, లెబనాన్‌లోని హిజ్బుల్లాలకు ఆయుధాలు సరఫరా అవుతున్నాయి. రష్యా, ఉత్తర కొరియాలకు కూడా ఇరాన్ ఆయుధాలు సప్లై అవుతున్నాయని అంటున్నారు.