Site icon HashtagU Telugu

29 Killed: డ్రగ్ లార్డ్ కొడుకును పట్టుకునేందుకు 29 మంది మృతి

Guzman

Resizeimagesize (1280 X 720) (1) 11zon

మెక్సికోలో డ్రగ్ కింగ్‌పిన్ ఎల్ చాపో గుజ్మాన్ కుమారుడిని అరెస్టు చేయడానికి శుక్రవారం చేపట్టిన ఆపరేషన్‌లో మొత్తం 29 మంది మరణించినట్లు (29 Killed) మెక్సికన్ ప్రభుత్వం తెలియజేసింది. మెక్సికోలోని భద్రతా దళాలు జైలులో ఉన్న డ్రగ్ లార్డ్ “ఎల్ చాపో” గుజ్మాన్ కుమారుడు గుజ్మాన్ లోపెజ్‌ను పట్టుకున్నారు. డ్రగ్ కార్టెల్ ఎల్ చాపో, జాతీయ సైన్యం మధ్య మెక్సికో వీధుల్లో ఘర్షణలు జరిగాయి. మెక్సికోకు చెందిన ప్రముఖ డ్రగ్ లార్డ్ ఎల్ చాపో 2016లోనే అరెస్టయ్యాడు. దీని తరువాత ఎల్ చాపో కొడుకు డ్రగ్ లార్డ్ ఒవిడియో గుజ్మాన్ లోపెజ్‌ను పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకుంటుండగా, భీకర కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో 19 మంది గుజ్మాన్ ముఠా సభ్యులు, 10 మంది సైనిక సిబ్బంది మరణించారని మెక్సికో రక్షణ మంత్రి లూయిస్ క్రెసెన్సియో సాండోవల్ శుక్రవారం వెల్లడించారు. చివరకు మెక్సికన్ దళాలు గుజ్మాన్ ను పట్టుకున్నాయి.

Also Read: US Man Kills Family: అమెరికాలో దారుణం.. కుటుంబసభ్యులని కాల్చి చంపిన భర్త

మెక్సికోలోని వాయువ్య ప్రాంతంలోని కులియాకాన్‌లో జరిగిన అరెస్ట్ ఆపరేషన్‌లో అనేక వాహనాలు కూడా బూడిదయ్యాయి. ఈ సమయంలో పోలీసు భద్రతా సిబ్బంది ముగ్గురు మరణించారు. ప్రముఖ మెక్సికన్ డ్రగ్ కింగ్ పిన్ “ఎల్ చాపో” కుమారుడిని అరెస్టు చేసిన తర్వాత సినలోవా రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా మద్దతుదారులు నిరసనలు ప్రారంభించారు. డ్రగ్స్ ముఠా సభ్యులు రోడ్లను దిగ్బంధించారు. వాహనాలను తగులబెట్టారు. స్థానిక విమానాశ్రయంపై దాడి చేశారు. ఆ తర్వాత సినలోవా విమానాశ్రయాలలో 100 కంటే ఎక్కువ విమానాలు రద్దు చేయబడ్డాయి.

మెక్సికోలోని ప్రజలు గుజ్మాన్-లోపెజ్‌ని మౌస్ అని పిలుస్తారు. అతని తండ్రి లార్డ్ ఎల్ చాపో యాజమాన్యంలోని అపఖ్యాతి పాలైన సినాలోవా కార్టెల్ వర్గానికి నాయకత్వం వహించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో గాయపడిన 18 మందిని ఆసుపత్రిలో చేర్చినట్లు రాష్ట్ర గవర్నర్ తెలిపారు. దేశ రక్షణ మంత్రి లూయిస్ క్రెసెనియో సాండోవల్ అన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటి.

Exit mobile version