110 Murders : దారుణం జరిగింది. అమానుషంగా ఒకే ఏరియాలోని 110 మందిని చంపేశారు. కారణమేంటో తెలిస్తే మీరు షాక్ కావడం ఖాయం !! వివరాల్లోకి వెళితే.. కరీబియన్ దేశం హైతీలో రౌడీ గ్యాంగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కో ఏరియాపై ఒక్కో గ్యాంగ్ పెత్తనం ఉంటుంది. ఆయా ఏరియాల్లో ఏది జరగాలన్నా.. ఈ గ్యాంగుల లీడర్లకు ముందుగా తెలియాల్సిందే. హైతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్‌లో సైట్ సోలైల్ అనే మురికివాడ ఉంది. ఈ ఏరియాలో వివ్ అన్సన్మ్ అనే పేరుతో ఒక రౌడీ గ్యాంగ్ ఉంది. దీనికి లీడర్‌గా మోనెల్ మికానో ఫెలిక్స్ వ్యవహరిస్తున్నాడు. ఇతగాడి కనుసన్నల్లోనే మొత్తం మురికివాడ ఉంటుంది. ఇటీవలే ఇతగాడి కుమారుడికి జబ్బు చేసింది. మోనెల్ మికానో ఫెలిక్స్ తన కొడుకును తీసుకెళ్లి ఒక పూజారికి చూపించాడు.
Also Read :Judge Comments : ‘‘ఇది హిందుస్తాన్.. మెజారిటీ ప్రజల ప్రకారమే దేశం నడుస్తుంది’’ : హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్‌కుమార్ యాదవ్
ఆ బాబును బాగా తరచి చూసిన పూజారి(110 Murders).. ‘‘కొందరు చేస్తున్న చేతబడులు, క్షుద్రపూజల వల్లే నీ కొడుకు ఆరోగ్యం పాడవుతోంది. ప్రత్యేకించి కొందరు ముసలివాళ్లు ఈ చేతబడులు చేస్తున్నారు. నీ కొడుకుకు హాని చేయడమే వాళ్ల టార్గెట్’’ అని చెప్పాడు. ఈ మాటలు విన్న రౌడీ గ్యాంగ్ లీడర్ మోనెల్ మికానో ఫెలిక్స్ కోపం కట్టలు తెంచుకుంది. తన కొడుకుపై చేతబడులు చేస్తున్న ముసలివాళ్లు అందరినీ చంపేస్తానని ప్రకటించాడు. తన ముఠా సభ్యులను పిలిపించి.. సైట్ సోలైల్ మురికివాడలో ఉన్న 60 ఏళ్లు పైబడిన ముసలి వాళ్లను కడతేర్చాలని ఆదేశించాడు.
Also Read :PM – Adani Masks : మోడీ-అదానీ మాస్క్‌లు ధరించిన కాంగ్రెస్ ఎంపీలు.. రాహుల్‌గాంధీ ప్రశ్నలకు జవాబులు
దీంతో ఆ అల్లరిమూకలు రెచ్చిపోయారు. వేట కొడవళ్లు, కత్తులు, తల్వార్లతో చెలరేగిపోయారు. మురికివాడలోని ఇళ్లలోకి వెళ్లి ముసలి వాళ్లను దారుణంగా మర్డర్ చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన.. బాధిత కుటుంబీకులను కూడా హత్య చేశారు. దీంతో ఆ మురికివాడలో దాదాపు రెండు రోజుల పాటు రక్తం ఏరులై పారింది. 110 మంది ప్రాణాలు కోల్పోయారు. నేషనల్ హ్యూమన్ రైట్ డిఫెన్స్ నెట్‌వర్క్ అనే సంస్థ ఈవివరాలను వెలుగులోకి తెచ్చింది. ఈ దారుణం జరిగిన సైట్ సోలైల్ మురికివాడలో రౌడీ గ్యాంగ్‌ల సంచారం ఎక్కువ. సామాన్య ప్రజలు కనీసం ఫోన్లలో పోలీసులకు సమాచారమిచ్చినా పెద్ద రిస్కును ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఈ కారణాలతో రౌడీ గ్యాంగు రక్తక్రీడ వివరాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి.