Site icon HashtagU Telugu

Nigeria Stampede: చర్చిలో తొక్కిసలాట.. 10 మంది దుర్మ‌ర‌ణం

Nigeria Stampede

Nigeria Stampede

Nigeria Stampede: ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో (Nigeria Stampede) వారం వ్య‌వ‌ధిలో ఇది రెండో అతిపెద్ద ప్రమాదం. మరోసారి తొక్కిసలాట జరిగి 10 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. నైజీరియా ప్రస్తుతం ఆర్థిక, సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రజలు మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛంద సంస్థలు, చర్చలు, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వ్యక్తులు క్రిస్మస్‌కు ముందు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిలో ప్రజలకు ఆహార పదార్థాలు, బట్టలు పంపిణీ చేస్తున్నారు. అలాంటి ఒక కార్యక్రమంలో.. హాజరయ్యేందుకు వచ్చిన జనం రద్దీని అదుపు చేయలేక గందరగోళం నెల‌కొంది. ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడికి ఇక్కడకు పరుగులు తీయడం మొదలుపెట్టి తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ విధంగా క్రిస్మస్ వేడుకల ఆనందం క్షణంలో శోకసంద్రంగా మారింది.

చర్చి లోపల నుండి 1000 మందిని ఖాళీ చేయించారు

మీడియా కథనాల ప్రకారం.. నైజీరియా రాజధాని అబుజాలోని మైతామాలోని హోలీ ట్రినిటీ క్యాథలిక్ చర్చిలో తొక్కిసలాట జరిగింది. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా తెల్లవారుజామున 4 గంటలకే జనం గుమిగూడారు. చర్చిలో ఒకే ద్వారం ఉండటంతో ప్రజలు ఇరుక్కుపోయారు. తినుబండారాలు, బట్టలు తీసుకునే రేసులో తోపులాట జరిగింది. ఈ గందరగోళం కారణంగా.. ప్రజలు కింద పడి నలిగిపోయారు. తొక్కిసలాట గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ బృందాలు చర్చి నుండి 1,000 మందికి పైగా ప్రజలను తరలించారు. 10 మంది మృతదేహాలను వెలికితీసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, సిబ్బంది కొరతతో ప్రజలు సహాయం కోసం కేకలు వేయడం కనిపించింది. ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది.

Also Read: Game Changer Song : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నెక్స్ట్ సాంగ్ వచ్చేసింది..

3000 మంది చర్చికి వచ్చారు

ఈ మేరకు పోలీసు అధికార ప్రతినిధి జోసెఫిన్ ఈడె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మైతామాలోని హోలీ ట్రినిటీ క్యాథలిక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ కార్యక్రమంలో ఆహార పదార్థాలు, బట్టలు పంపిణీ చేయవలసి ఉంది. దీని కోసం అవసరమైన దానికంటే ఎక్కువ మంది చర్చకు వచ్చారు. దాదాపు 3,000 మంది ఈ కార్యక్రమానికి వచ్చినట్లు క్యాథలిక్ సెక్రటేరియట్ అధికార ప్రతినిధి పాడ్రే మైక్ న్సికాక్ ఉమోహ్ తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత దేశవ్యాప్తంగా చర్చిలలో క్రిస్మస్ కార్యక్రమాలు రద్దు చేశారు.

నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారని, బుధవారం కూడా నైరుతి నగరమైన ఇబాడాన్‌లోని ఒక పాఠశాలలో తొక్కిసలాట జ‌రిగింది. ఇందులో సుమారు 35 మంది మరణించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారులు తమ తమ ప్రాంతాలలో గుమికూడడాన్ని నియంత్రించాలని, ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది.

Exit mobile version