Highest Peaks : 18 ఏళ్ల నేపాలీ కుర్రాడు నిమా రింజి షెర్పా కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. అతడు ప్రపంచంలోనే ఎత్తయిన 14 పర్వత శిఖరాలను ఎక్కి సత్తా చాటుకున్నాడు. ఈ పర్వత శిఖరాలన్నీ దాదాపు 8వేల మీటర్ల ఎత్తైనవే. ఇన్ని పర్వత శిఖరాలను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నిమా రింజి షెర్పా రికార్డును నెలకొల్పాడు. ‘‘ఇవాళ ఉదయాన్నే నా కొడుకు టిబెట్‌లోని ఎవరెస్టు పర్వత శిఖరాన్ని ఎక్కాడు. ఆ పర్వత శిఖరం ఎత్తు 8,027 మీటర్లు’’ అని నిమా రింజి షెర్పా తండ్రి తాషీ షెర్పా (Highest Peaks) చెప్పారు. ఎవరెస్టు ఎక్కేందుకు తన కొడుకు చాలా ట్రైనింగ్ తీసుకున్నాడని తెలిపారు. ‘‘నా కుమారుడు ఎక్కిన పర్వతాలపై ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా ఎక్కువసేపు వాటిపై గడపలేరు’’ అని తాషీ షెర్పా వివరించారు.
Also Read :Mental Health Day 2024 : మానసిక సమస్యల వలయంలో మానవాళి.. అవగాహనతోనే పరిష్కారం
‘‘ఎవరెస్టు సహా 14 ఎత్తైన పర్వతాలపైకి ఎక్కడం నాాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దీన్ని నా వ్యక్తిగత ప్రయాణంగా చూడకండి. ఎవరెస్టును ఎక్కేందుకు సాహసించే ప్రతి ఒక్కరికి ఇది నా నివాళి. నేను పడిన శ్రమ కంటే పర్వతారోహణే చాలా గొప్పది. మనలోని బలం, బ్యాలెన్స్, ఫోకస్‌కు పర్వతారోహణ నిదర్శనంగా నిలుస్తుంది’’ అని నిమా రింజి షెర్పా వివరించారు.
Also Read :Tata – BMW : టాటాతో చేతులు కలిపిన బీఎండబ్ల్యూ.. ఏం చేయబోతున్నాయంటే..
నిమా రింజి షెర్పాకు పర్వతారోహణ చేయాలనే ఆలోచన వారి కుటుంబ సభ్యుల నుంచే వచ్చింది. వారి పూర్వీకుల్లో చాలామందికి పర్వతారోహణ చేసిన అపార అనుభవం ఉంది. వారంతా నిమా రింజికి ట్రైనింగ్ ఇచ్చారు. విలువైన సలహాలు, సూచనలను అందజేశారు. నిమా రింజి కుటుంబం నేపాల్‌లో అతిపెద్ద పర్వతారోహణ సంస్థను కూడా నడుపుతోంది. దీనివల్ల పర్వతారోహణకు అవసరమైన అన్ని ఖర్చులను ఆ సంస్థే భరించింది. గతంలో ప్రపంచంలోని 14 ప్రధాన పర్వతాలను ఎక్కిన రికార్డు నేపాలీ పర్వతారోహకుడు మింగ్మా గ్యాబు ‘డేవిడ్’ షెర్పా పేరిట ఉంది. అతడు 2019 సంవత్సరంలో 30 ఏళ్ల వయసులో 14 పర్వతాలను ఎక్కాడు. ఇప్పుడు కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును నిమా రింజి తిరగ రాశాడు.