రాజకీయాల్లో ఎవర్ని ఎక్కువగా నమ్మొద్దు..మనవెంటే ఉంటూ మనల్నే వెన్నుపోటు పొడుస్తారు. ఇది చాలామందికి చాల సార్లు జరిగిందే..ఇప్పుడు బంగ్లా దేశ్ ప్రధాని షేక్ హసీనా (Bangladesh PM Sheikh Hasina)కు కూడా అదే జరిగిందని ప్రచారం జరుగుతుంది. ప్రధాని షేక్ హసీనా వెంటే ఉన్న ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ (Army chief Waker-Uz-Zaman)..సమయం చూసుకొని వెన్నుపోటు పొడవమే కాదు..షేక్ హసీనా ను ఏకంగా దేశం వదిలిపారిపోయేలా చేసాడని ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆమె.. ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ ను గుడ్డిగా నమ్మి..అతడు చెప్పినదానికి సరే అంటూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం..ఇప్పుడు ఆమెను దేశం వదిలిపారిపోయేలా చేసింది. వకార్ ఉజ్ జమాన్ గురించి భారత్ ముందుగానే షేక్ హసీనాను హెచ్చరించినా ఆమె వినకుండా అతడ్ని సైనిక అధ్యక్షుడిగా నియమించడమే ఆమె చేసిన పెద్ద తప్పు. క్లిష్ట సమయాల్లో ప్రధాని వెంట ఉంటూ అందర్నీ శాంతింపజేయాల్సిన ఆర్మీ చీఫ్..తానే స్వయంగా ఉద్యమాన్ని ఎగదోసాడంటే అర్ధం చేసుకోవాలి..ఎంత వెన్నుపోటు పొడిచాడో..!!
We’re now on WhatsApp. Click to Join.
అసలు వకార్ ఉజ్ జమాన్ (Army chief Waker-Uz-Zaman) ఎవరు..?
వకార్ ఉజ్ జమాన్ (58).. గత 40 ఏళ్లుగా బంగ్లాదేశ్ సైన్యంలో పనిచేస్తున్నారు. డిఫెన్స్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఈయన.. గతంలో ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ విభాగంలో ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా విధులు చేపట్టారు. బంగ్లాదేశ్ ఆర్మీని ఆధునికీకరించడంలో వకార్ ఉజ్ జమాన్.. కీలక పాత్ర పోషించడంతో ఆర్మీ చీఫ్‌గా ఈ ఏడాది జూన్ 23 న నియమితులయ్యారు. ఈ పదవిలో వకార్ ఉజ్ జమాన్ 3 ఏళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ చీఫ్ ముస్తాఫిజుర్ రెహమాన్ కుమార్తెను వకార్ ఉజ్ జమాన్ వివాహం చేసుకోగా.. షేక్ హసీనాకు ముస్తాఫిజుర్ రెహమాన్ వరుసకు మామ అవుతారు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌గా వకార్ ఉజ్ జమాన్‌ను ప్రధానమంత్రి షేక్ హసీనా నియమించారు. అయితే వకార్ ఉజ్ జమాన్‌ను ఆర్మీ చీఫ్ నియామకం విషయంలో షేక్ హసీనాను ఏడాది ముందే భారత్ హెచ్చరించింది. చైనా అనుకూల వ్యక్తి అయిన వకార్ ఉజ్ జమాన్‌తో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. అయినా షేక్ హసీనా.. అతడ్నే సైనిక అధ్యక్షుడిగా నియమించడమే కాక ఆయన చెప్పినట్లే పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలతో ప్రజల్లో హసీనా ఫై వ్యతిరేకత వచ్చేలా జమాన్ చేసాడు. చివరకు హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తేవడమే కాదు..చివరకు ఆమె దేశం వదిలిపారిపోయేలా చేసాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు.
Read Also : Olympics Covid Cases: పారిస్ ఒలింపిక్స్‌లో 40 మందికిపైగా అథ్లెట్లకు కరోనా