Site icon HashtagU Telugu

Japan Internet Speed :జపాన్ మరో అద్భుతం..ఒక సెకనకు 100 జీబీ స్టోరేజీ డౌన్‌లోడ్ చేసే ఇంటర్నెట్ ఆవిష్కరణ!

Japan Internet Speed

Japan Internet Speed

Japan Internet Speed : జపాన్ సాంకేతిక రంగంలో మరో అద్భుతం సృష్టించింది. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ స్పీడ్‌తో పనిచేసే ఇంటర్నెట్‌ను అభివృద్ధి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. పెటా బైట్ అంటే ఒక మిలియన్ గిగా బిట్స్ అని అర్థం. అంటే ఈ వేగం సెకనుకు ఒక మిలియన్ గిగాబైట్ల డేటాను పంపగలదు. మన ప్రస్తుతం వాడుతున్న సాధారణ ఇంటర్నెట్ స్పీడ్ కంటే ఇది లక్షల రెట్లు ఎక్కువ. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (NICT) ఈ విజయాన్ని సాధించింది. ఈ రికార్డు ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఫైబర్ నెట్వర్క్‌లకు సైతం..

ఈ అద్భుత వేగాన్ని సాధించడానికి జపాన్ శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగించారు. ఒకే లైన్ ద్వారా కాకుండా, 19 కోర్లు గల ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను ఉపయోగించారు. ఇది ఒకే కేబుల్‌లో 19 వేర్వేరు డేటా లైన్‌లను ఏర్పాటు చేసినట్లుగా ఉంటుంది. దీని ద్వారా సమాచారం ఏకకాలంలో పారలల్‌గా ప్రయాణిస్తుంది. అంతేకాకుండా, ఈ సాంకేతికత ఇప్పటికే ఉన్న ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌లకు అనుగుణంగా ఉండేలా రూపొందించబడింది. ఇది డేటా ట్రాఫిక్ డిమాండ్లను సులభంగా నిర్వహించగలదు. ఈ ఫైబర్ కేబుల్ ద్వారా 1,800 కిలోమీటర్ల దూరం వరకు డేటాను ఎలాంటి వేగం తగ్గకుండా పంపించవచ్చని పరిశోధకులు తెలిపారు.

ఈ రకమైన వేగ పరీక్షలు కేవలం జపాన్ మాత్రమే కాకుండా, గతంలో ఇతర దేశాల పరిశోధకులు కూడా నిర్వహించారు. అయితే, జపాన్ సాధించిన ఈ వేగం అత్యంత సుదూర ప్రాంతాలకు డేటాను పంపగలిగే సామర్థ్యాన్ని రుజువు చేసింది. జపాన్ NICT గతంలో 402 టెరా బిట్స్ స్పీడ్‌ను కూడా నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఇది అంతకుముందు రికార్డు. డచ్, జపనీస్, ఇటాలియన్ పరిశోధకులు కలిసి ఒకే ఫైబర్ కేబుల్ ద్వారా 22.9 పెటా బైట్స్ స్పీడ్‌ను పరీక్షించారు. కానీ అది తక్కువ దూరాన్ని మాత్రమే అందుకోగలిగింది. అందుకే దూరంతో పాటు వేగం కూడా ప్రధానమైనది.

నెట్ ఫ్లిక్స్ లైబ్రరీ మొత్తం డౌన్ లోడ్..

ఈ అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ మన భవిష్యత్తును ఎలా మార్చగలదో ఊహించవచ్చు.ప్రస్తుతం మనం అనుభవిస్తున్న సాంకేతికతకు ఇవి కేవలం ఆరంభం మాత్రమే. ఈ వేగంతో, మనం భారీ ఫైళ్లను, మొత్తం నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీని సెకన్లలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, ఈ టెక్నాలజీ భవిష్యత్తులోని 6G నెట్‌వర్క్‌లకు, క్లౌడ్ కంప్యూటింగ్, స్వయం-ప్రతిపత్త వాహనాలు (Autonomous Vehicles), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అంతర్జాతీయ డేటా కేంద్రాల మధ్య వేగవంతమైన కమ్యూనికేషన్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తుంది.

ఈ సరికొత్త ఆవిష్కరణ ప్రస్తుతానికి ప్రయోగశాల దశలో ఉన్నప్పటికీ, ఇది భవిష్యత్ డిజిటల్ ప్రపంచానికి, పెరుగుతున్న డేటా అవసరాలను తీర్చడానికి ఒక ముఖ్యమైన ముందడుగుగా పరిగణించవచ్చు. అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ పెరుగుతున్న ఈ తరుణంలో, పాత మౌలిక సదుపాయాలనే మెరుగుపరుస్తూ ఇంతటి వేగాన్ని సాధించడం అనేది ప్రశంసనీయం. ఈ సాంకేతికత వాణిజ్య వినియోగంలోకి రావడానికి కొంత సమయం పట్టినప్పటికీ, ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలికింది.

Body Shivering : ఒక్కసారిగా బాడీ వణకడం, చల్లటి చెమటలు వచ్చి కులబడుతున్నారా? ఈ లక్షణాలకు కారణం ఇదే!