Who Is Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్‌.. ఎవరు ?

అనితా ఆనంద్‌(Who Is Anita Anand) వయసు 58 ఏళ్లు. ఆమె 1967 మే 20న కెనడాలోని కెంట్‌విల్లేలో జన్మించారు.

Published By: HashtagU Telugu Desk
Anita Anand Canada New Foreign Minister

Who Is Anita Anand: కెనడా నూతన విదేశాంగ శాఖ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్‌ బాధ్యతలు చేపట్టారు. ఆమె భగవద్గీత సాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. అనితా ఆనంద్‌ రాకతో ఇక నుంచి భారత్ – కెనడా సంబంధాలు బలోపేతం అవుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. కెనడా మాజీ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో హయాంలో దారుణంగా దెబ్బతిన్న ఇరుదేశాల సంబంధాలను మళ్లీ గాడిన పెట్టేందుకు అనిత ప్రయత్నాలు చేసే అవకాశముంది.  ఇంతకీ ఎవరీ అనితా అనంద్ ? ఆమె నేపథ్యం ఏమిటి ?

Also Read :KA Paul In Turkey: టర్కీలో కేఏ పాల్.. మిస్సైళ్లు, డ్రోన్లపై సంచలన కామెంట్స్

తల్లి పంజాబీ.. తండ్రి తమిళనాడు వాస్తవ్యుడు

  • అనితా ఆనంద్‌(Who Is Anita Anand) వయసు 58 ఏళ్లు. ఆమె 1967 మే 20న కెనడాలోని కెంట్‌విల్లేలో జన్మించారు.
  • అనిత తల్లి సరోజ్‌ దౌలత్‌రామ్‌ పంజాబ్‌ వాస్తవ్యురాలు. ఆమె కెనడాలో అనస్తీషియాలజిస్ట్‌‌గా స్థిరపడ్డారు. అనిత తండ్రి సుందరం వివేక్‌ స్వస్థలం తమిళనాడు. ఈయన జనరల్‌ సర్జన్‌.
  • సరోజ్‌ దౌలత్‌రామ్‌, సుందరం వివేక్‌ దంపతుల ముగ్గురు పిల్లల్లో పెద్దమ్మాయి అనిత.
  • పొలిటికల్‌ సైన్స్‌లో అకడమిక్‌ డిగ్రీ చదివిన అనిత.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ కోర్సును పూర్తి చేశారు.
  • డల్హౌసీ యూనివర్సిటీలో లా చేశారు.
  • అనితా ఆనంద్‌ కార్పొరేట్‌ లాయర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టారు.
  • ఆమె పలు యూనివర్సిటీల్లో లా ప్రొఫెసర్‌గా, విజిటింగ్‌ లెక్చరర్‌గా పని చేశారు.
  • ఆ తర్వాత రాజకీయాల్లోకి అనిత ఎంట్రీ ఇచ్చారు.
  • తొలిసారిగా 2019లో లిబరల్‌ పార్టీ తరఫున ఓక్‌విల్లే నుంచి హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌‌కు అనిత ప్రాతినిధ్యాన్ని పొందారు.

Also Read :Jaishankars Security: జైశంకర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు.. 25 మంది నేతలకు భద్రత పెంపు

మహిళా సైనికులపై లైంగిక వేధింపుల్ని అరికట్టే దిశగా.. 

  • తొలిసారి ఎంపీ అయిన వెంటనే.. నాటి కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో మంత్రివర్గంలో అనితకు చోటు దక్కింది.
  • 2019 నుంచి 2021 వరకు కెనడా పబ్లిక్‌ సర్వీసెస్, ప్రొక్యూర్‌మెంట్‌ మినిస్టర్‌గా అనిత సేవలు అందించారు. కెనడాలో ఈ పదవిని పొందిన తొలి హిందూ నేతగా ఆమె ఘనతను  సాధించారు.
  • తదుపరిగా రెండేళ్ల పాటు కెనడా రక్షణమంత్రిగానూ ఆమె సేవలు అందించారు. ఆ టైంలోనే ఉక్రెయిన్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.
  • కెనడా ఆర్మీలో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపుల్ని అరికట్టే దిశగా కొత్త సంస్కరణల తీసుకొచ్చారు. ఇందుకుగానూ ఆమెను  పలు పురస్కారాలు వరించాయి.
  • కెనడాకు చెందిన న్యాయవాది, వ్యాపారవేత్త జాన్‌ నోల్టన్‌ను అనిత పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు.
  Last Updated: 14 May 2025, 11:22 AM IST