Site icon HashtagU Telugu

Angara Airlines : రష్యాలో విమానం మిస్సింగ్‌.. విమానంలో 49 మంది..

Russian Plane Crashed

Russian Plane Crashed

Angara Airlines : రష్యాలోని దూర తూర్పు ప్రాంతంలో అంగారా ఎయిర్ లైన్స్ (Angara Airlines‌)కు చెందిన Antonov An-24 ప్రయాణికుల విమానం మిస్సింగ్ అయింది. ఈ విమానంలో 43 మంది ప్రయాణికులు (అందులో ఐదుగురు పిల్లలు), 6 మంది సిబ్బంది ఉన్నారని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 49 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం చివరిసారిగా అమూర్ ప్రాంతంలోని టిండా (Tynda) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆచూకీ లభించలేదు.

Angara Airlines పాత మోడల్ Antonov An-24 విమానం ఉదయం సాధారణ షెడ్యూల్‌ ప్రకారం బయలుదేరింది. కానీ గమ్యస్థానం చేరకముందే రాడార్‌ నుంచి అదృశ్యమైంది. రష్యా అత్యవసర సేవలు (Emergency Services), ఎయిర్ డిఫెన్స్ విభాగాలు ఇప్పటికే సర్చ్, రక్షణ ఆపరేషన్ ప్రారంభించాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు మరియు భూ దళాలు ఈ శోధనలో పాల్గొంటున్నాయి.

Vice President : దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాల్సిందే – రేవంత్ డిమాండ్

అమూర్ ప్రాంత గవర్నర్ వసిలీ ఓర్లొవ్ (Vasily Orlov) మాట్లాడుతూ.. “విమానం కోసం మేము విస్తృత శోధన చేపట్టాం. ఈ విమానం మిస్సింగ్ కావడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. అందరికీ సురక్షితంగా తిరిగి రావాలని ఆశిస్తున్నాం” అని తెలిపారు.

Angara Airlines అనేది సైబీరియాలోని ఇర్కుత్స్క్‌ కేంద్రంగా పనిచేసే ప్రాంతీయ విమానయాన సంస్థ. ఈ సంస్థలో ఎక్కువగా పాత Antonov An-24 , An-26 మోడల్ విమానాలు ఉపయోగిస్తారు. ఈ విమానాలు దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించబడినవి కావడంతో, భద్రతా ప్రమాణాలపై తరచూ ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి.

ఈ ప్రమాదంపై రష్యా ఇన్వెస్టిగేషన్ కమిటీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. అంతర్జాతీయ మీడియా కూడా ఈ ఘటనను విస్తృతంగా కవర్ చేస్తోంది. ప్రయాణికుల కుటుంబాలు , స్థానిక ప్రజలు ఎయిర్‌పోర్ట్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సర్ఛ్ బృందాలు ఇప్పటికే 24 గంటలు నిరంతరంగా పని చేస్తున్నాయి. విమానం ఏదైనా దూరప్రాంతం లేదా అటవీ ప్రాంతంలో పడిపోయి ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మిస్సింగ్ విమానం కనుగొనబడకపోతే, రాబోయే రోజుల్లో విస్తృత ఆపరేషన్లు చేపట్టనున్నారు.

Health Tips: వ‌ర్షంలో త‌డుస్తున్నారా? అయితే ఈ జాగ్ర‌త్తలు పాటించండి!