Woman Murdered: లండన్​‌లో భారత మహిళ హత్య.. హంతకుడెవరంటే..?

లండన్‌లోని నార్తాంప్టన్‌లో గల కెట్టెరింగ్‌లో భారత మహిళ, ఆమె పిల్లలు హత్య (murdered)కు గురయ్యారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన అంజు(42) లండన్‌లో నర్సుగా పనిచేస్తోంది. తన భర్త సాజుతో ఆమెకు గొడవలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో సాజు తన భార్య అంజుతో పాటు ఇద్దరు పిల్లలను హత్య (murdered) చేశాడు.

  • Written By:
  • Publish Date - December 18, 2022 / 08:50 AM IST

లండన్‌లోని నార్తాంప్టన్‌లో గల కెట్టెరింగ్‌లో భారత మహిళ, ఆమె పిల్లలు హత్య (murdered)కు గురయ్యారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన అంజు(42) లండన్‌లో నర్సుగా పనిచేస్తోంది. తన భర్త సాజుతో ఆమెకు గొడవలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో సాజు తన భార్య అంజుతో పాటు ఇద్దరు పిల్లలను హత్య (murdered) చేశాడు. కాగా.. సాజు నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

బ్రిటన్‌లోని ఈస్ట్ ఇంగ్లండ్ నార్తాంప్టన్ ప్రాంతంలో ఒక భారతీయ సంతతికి చెందిన మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు వారి అపార్ట్మెంట్లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా, మహిళ, పిల్లలపై కత్తితో దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ విషయమై స్థానిక పోలీసులు సమాచారం ఇస్తూ.. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన మహిళ పేరు అంజు అని తెలిపారు. లండన్‌కు 110 కిలోమీటర్ల దూరంలోని కెట్టెరింగ్‌లోని తన ఇంటి వద్ద ఆమెపీ కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించింది. అంజు ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తెకు కూడా ఇలాంటి గాయాలే ఉన్నాయని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు.

స్థానిక నార్తాంప్టన్‌ పోలీస్ సూపరింటెండెంట్ స్టీవ్ ఫ్రీమాన్ పోలీసింగ్ ఏరియా కమాండర్ మాట్లాడుతూ.. ఈ సంఘటన ఎంత బాధ కలిగించిందో వర్ణించడానికి పదాలు లేవని, అయితే ఈ విషయంపై పనిచేస్తున్న డిటెక్టివ్‌ల బృందం ఉందని అన్నారు. స్థానిక నివేదికల ప్రకారం.. గురువారం రాత్రి 11.15 గంటలకు మృతురాలి అపార్ట్‌మెంట్ నుండి ఇరుగుపొరుగు వారు గొడవ విని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు సూపరింటెండెంట్ స్టీవ్ ఫ్రీమాన్ మాట్లాడుతూ.. పోస్టుమార్టం జరుగుతోందని, పోలీసులు హత్య దర్యాప్తు ప్రారంభించారని చెప్పారు. మహిళ భర్త సాజు (52)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి స్వల్ప గాయాలైనట్లు స్థానిక సమాచారం.

Also Read: Prime Minister Narendra Modi: నేడు మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

మరోవైపు కొట్టాయంలోని వైకోమ్‌లోని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన సహోద్యోగి ద్వారా ఈ సంఘటన గురించి తెలిసిందని అంజు తల్లిదండ్రులు తెలిపారు. అసలు అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదని అంజు తండ్రి పి.అశోకన్ చెప్పారు. తన కూతురు రెండేళ్ల క్రితమే యూకే వెళ్లిందని, ఏడాది క్రితం తన భర్త, పిల్లలతో తిరిగి వచ్చిందని తెలిపారు.