Mother Of All Bombs : మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్.. చాలా డేంజరస్. ఇప్పుడు దీనిపై అంతటా చర్చ జరుగుతోంది. జీబీయూ 43 బాంబును మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పిలుస్తారు. ఇది త్వరలోనే మరో డేంజరస్ దేశం చేతిలోకి చేరనుంది. అదే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశానికి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ను ఇచ్చేందుకు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పచ్చజెండా ఊపారు. దీంతో అమెరికా నుంచి ఈ డేంజరస్ బాంబును పొందేందుకు గత 25 ఏళ్లుగా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు అయింది. ట్రంప్ ఈసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నీ తొందరపాటు నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఈక్రమంలో తీసుకున్న కీలకమైన తప్పుడు నిర్ణయం.. ఇజ్రాయెల్‌కు జీబీయూ 43 బాంబును ఇవ్వడం. ఏ మాత్రం ఆలోచించకుండా పాలస్తీనా, లెబనాన్, సిరియా ప్రజలపైకి బాంబులు జారవిడిచే స్వభావం కలిగిన ఇజ్రాయెల్ చేతికి ఇంత డేంజరస్ బాంబును ఇవ్వడం అనేది ప్రపంచ భద్రతకే పెద్ద ముప్పు.
Also Read :Asias Richest Families : ఆసియాలోని టాప్-10 సంపన్న కుటుంబాల్లో నాలుగు మనవే.. ఎవరివో తెలుసా ?
ఈ బాంబుతో ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది ?
మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్(Mother Of All Bombs) చేతికి అందిన తర్వాత ఇజ్రాయెల్ కామ్‌గా ఊరుకునే ఛాన్స్ లేదు. త్వరలోనే శత్రుదేశం ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోంది. ఇరాన్‌లోని అణ్వాయుధ తయారీ యూనిట్లపై దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇజ్రాయెల్ తొందరపాటుతో ఇరాన్‌లోని అణ్వాయుధ తయారీ యూనిట్లపై మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ (జీబీయూ 43)ను జారవిడిచే ముప్పు లేకపోలేదు. ఈ బాంబును చేతిలో పెట్టుకొని ఇరాన్‌ను భయపెట్టాలనే వ్యూహంతో ఇజ్రాయెల్ ముందుకుసాగుతోంది. ఇరాన్‌లోని వివిధ ఎడారుల్లో చాలా లోతుల్లో సీక్రెట్ బంకర్లు ఉన్నాయి. ఆ బంకర్లలోనే అణ్వాయుధాల తయారీ కార్యక్రమం నడుస్తోంది. అంతలోతు దాకా చొచ్చుకు వెళ్లి, తీవ్రమైన పేలుడును చేయగల సామర్థ్యం ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’కు ఉంటుంది. అందుకే ఏరీకోరి దాన్ని ఇజ్రాయెల్ పొందుతోంది. ఇరాన్‌లోని ఫాద్వా, నటాంజ్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే మరోసారి పశ్చిమాసియా ప్రాంతం వేడెక్కుతుంది. ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు తెగబడుతుంది. విదేశాలపై పెత్తనానికి అమెరికా, దాని మిత్రదేశం ఇజ్రాయెల్ పాకులాడుతుండటం అనేది ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తోంది. తమ ఆధిపత్యమే పశ్చిమాసియాలో నడవాలనే దురహంకార వైఖరి అమెరికా, ఇజ్రాయెల్ విధానాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read :Delhi CM : ఢిల్లీ సీఎం రేసులో స్మృతీ ఇరానీ, బన్సూరీ స్వరాజ్.. ఎవరికో ఛాన్స్ ?
ఏమిటీ ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ ?
- మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ను తయారు చేసే ప్రక్రియ 2002 సంవత్సరంలో జార్జ్ బుష్ హయాంలో మొదలైంది.
- దీన్ని తొలిసారిగా 2003లో అమెరికాలోని ఉత్తర ఫ్లోరిడా ప్రాంతంలో టెస్ట్ చేశారు.
- ఈ బాంబు పేలుడుతో వెలువడిన పొగలు 20 మైళ్ల దూరం వరకు కనిపించాయి.
- ఈ బాంబు పేలుడు వల్ల 1000 కిలోమీటర్లకుపైగా దూరంలోని ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి.
- మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ బాంబు బరువు 11 టన్నులు. దీన్ని చిన్నపాటి అణ్వాయుధంగా చెబుతుంటారు.
- యుద్ధ విమానంతో పాటు సాధారణ విమానం నుంచి కూడా దీన్ని భూమిపై ఉన్న శత్రు లక్ష్యం వైపుగా జారవిడవవచ్చు.