అమెజాన్ సంచలన నిర్ణయం.. ఉత్తర కొరియా దరఖాస్తుదారులపై నిషేధం!

అమెరికాలో కంప్యూటర్లను ఉంచి, వాటిని దేశం వెలుపల నుండి రిమోట్‌గా నియంత్రిస్తూ తాము అమెరికాలోనే ఉన్నట్లు కంపెనీలను నమ్మిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Amazon

Amazon

Amazon: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులను కలిగిన దిగ్గజ సంస్థ అమెజాన్ తన నియామక విధానంలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త మార్పుల ప్రకారం.. ఆసియాలోని ఒక దేశానికి చెందిన వ్యక్తులు అమెజాన్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోకుండా బ్లాక్ చేసింది. ఆ దేశం పేరు ఉత్తర కొరియా.

కిమ్ జోంగ్ ఉన్ దేశానికి షాక్ ప్రస్తుతం నియంత కిమ్ జోంగ్ ఉన్ నాయకత్వంలో ఉన్న ఉత్తర కొరియాకు చెందిన వారు ఇకపై అమెజాన్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని కంపెనీ స్పష్టం చేసింది. గత ఏడాది కాలంలో ఉత్తర కొరియా నుండి వచ్చే దరఖాస్తులు మూడింట ఒక వంతు పెరగడమే దీనికి ప్రధాన కారణం.

హ్యాకర్ల చొరబాటుపై హెచ్చరిక అమెజాన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ స్టీఫెన్ ష్మిత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కొరియా హ్యాకర్లు ‘రిమోట్ ఐటీ వర్కర్ల’ వేషంలో అమెరికన్ కంపెనీల్లోకి ముఖ్యంగా టెక్ రంగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమస్య కేవలం అమెజాన్‌కే పరిమితం కాలేదు. అనేక ఇతర పరిశ్రమల్లో కూడా వ్యాపించింది.

Also Read: ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

కంపెనీలను మోసం చేసే పద్ధతులు

నకిలీ గుర్తింపు కార్డులు: ఈ హ్యాకర్లు దొంగిలించిన లేదా నకిలీ ఐడెంటిటీ కార్డులను ఉపయోగిస్తున్నారు.

లాప్‌టాప్ ఫామ్స్: అమెరికాలో కంప్యూటర్లను ఉంచి, వాటిని దేశం వెలుపల నుండి రిమోట్‌గా నియంత్రిస్తూ తాము అమెరికాలోనే ఉన్నట్లు కంపెనీలను నమ్మిస్తున్నారు.

అనుమానాస్పద వివరాలు: తప్పుడు ఫార్మాట్‌లో ఉన్న ఫోన్ నంబర్లు, అనుమానాస్పద విద్యా అర్హత పత్రాలను వీరు సమర్పిస్తున్నారు.

1800 మంది దరఖాస్తుదారుల బ్లాక్ భద్రతా కారణాల దృష్ట్యా, అమెజాన్ ఇప్పటికే 1800 మందికి పైగా ఉత్తర కొరియా దరఖాస్తుదారులను బ్లాక్ చేసింది. ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఇతర కంపెనీలను కూడా అమెజాన్ కోరింది. ఉత్తర కొరియా తన అణ్వాయుధ కార్యక్రమాల కోసం నిధులు సేకరించడానికి ఇలాంటి ఐటీ ఉద్యోగాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వాడుకుంటోందని అంతర్జాతీయ నివేదికలు కూడా గతంలో హెచ్చరించాయి.

  Last Updated: 23 Dec 2025, 09:15 PM IST