4000 Year Old Town : సౌదీ అరేబియా అంటేనే ఫుల్‌గా ఎడారులు. ఎడారుల్లో ఒయాసిస్‌లు ఉంటాయనే విషయం మనకు తెలుసు. ఒయాసిస్‌లలో తాగడానికి నీరు దొరుకుతుంది. అల్ నతాహ్ అనే ప్రదేశంలోని ఒయాసిస్ వద్ద ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త గుయిలౌమ్ చార్లౌక్స్, ఆయన టీమ్ జరిపిన తవ్వకాల్లో ఒక ప్రాచీన పట్టణం బయటపడింది. అది దాదాపు 4వేల ఏళ్ల కిందటిది అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక కోట, దాని చుట్టూ జనావాసాలు ఉండటాన్ని గుర్తించారు. వీటికి సంబంధించిన ప్రాచీన అవశేషాలు అల్ నతాహ్ వద్ద పురావస్తు శాస్త్రవేత్తలకు దొరికాయి.
Also Read :Kiran Abbavaram : పెళ్లి చేసుకోండి.. సక్సెస్ వస్తుంది.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..
సౌదీ అరేబియాలో ప్రాచీన ప్రజానీకం సంచార జీవనం గడిపేవారు. వారు కాలక్రమంలో ఒకేచోట స్థిరంగా నివసించడం మొదలుపెట్టారు. ఈక్రమంలోనే అల్ నతాహ్ అనే ప్రదేశంలోనూ కోటను నిర్మించుకొని నివసించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ ప్రాచీన పట్టణం చుట్టూ దట్టమైన ఎడారి ప్రాంతం ఉంది. ఈ పట్టణం చుట్టూ రక్షణ కోసం అప్పట్లో 14.5 కిలోమీటర్ల గోడను(4000 Year Old Town) నిర్మించుకున్నారు. ఈమేరకు వివరాలతో కూడిన ఒక నివేదిక PLOS One జర్నల్‌లో పబ్లిష్ అయింది.
Also Read :Varun Tej : ఎంత పెద్ద తోపు అయినా పెళ్ళాం మాట వినాల్సిందే.. లావణ్యతో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ తర్వాత వరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
దీని ప్రకారం.. ఈ పట్టణం ప్రారంభ కాంస్య యుగంలో 2400 బీసీ కాలం నాటిది. ఈ పట్టణంలో అప్పట్లో 500 మంది నివసించే వారు. సౌదీ అరేబియాలో జరిగిన అతి ప్రాచీన పట్టణీకరణగా అల్ నతాహ్‌ను అభివర్ణిస్తున్నారు. ఈ ప్రదేశంలోని కోట దాదాపు 2.6 హెక్టార్లలో విస్తరించి ఉండటం విశేషం. ఈ పట్టణం సైజుపరంగా మెసపొటేమియా లేదా ఈజిప్షియన్ నగరాల కంటే చిన్నదే. అయినప్పటికీ ఇది ప్రాచీన సౌదీ అరేబియా జీవన శైలి, జనాభా అవసరాలను అద్దంపడుతోంది. మొత్తం మీద ఈ నివేదిక ప్రాచీన నిర్మాణ రీతుల వివరాలను వెలుగులోకి తెచ్చింది.