Site icon HashtagU Telugu

Putin- Kim Jong: పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆస‌క్తిక‌ర వీడియో వెలుగులోకి!

Putin- Kim Jong

Putin- Kim Jong

Putin- Kim Jong: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచవ్యాప్తంగా అనేక కారణాల వల్ల వార్తల్లో ఉంటారు. ఆయనతో పాటు నడిచే సిబ్బంది కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు. తాజాగా చైనా పర్యటనలో కిమ్ సిబ్బందికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రతి వస్తువునూ శుభ్రం చేసిన సిబ్బంది

బీజింగ్‌లో జరిగిన సైనిక పరేడ్‌లో పాల్గొన్న కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో (Putin- Kim Jong) భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత జరిగిన ఒక ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. పుతిన్‌తో సమావేశంలో కిమ్ తాకిన ప్రతి వస్తువును ఆయన సిబ్బంది శుభ్రం చేస్తున్నారు.

Also Read: AI Training For Journalists: తెలంగాణలో జర్నలిస్టులకు తొలి ఏఐ శిక్షణ!

విషయం ఏంటంటే.. బుధవారం బీజింగ్‌లో జరిగిన సైనిక పరేడ్ తర్వాత కిమ్ జోంగ్, పుతిన్‌లు సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత కిమ్ జోంగ్ సిబ్బందిలో ఇద్దరు వ్యక్తులు పని చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఒక వ్యక్తి కిమ్ కూర్చున్న కుర్చీని శుభ్రం చేస్తుండగా, మరొక వ్యక్తి ఫోరెన్సిక్ నిపుణుడిలా కిమ్ గ్లాసును జాగ్రత్తగా ట్రేలో పెట్టి తీసుకెళ్తున్నారు. కిమ్ తాకిన ప్రతి వస్తువును అత్యంత జాగ్రత్తగా శుభ్రం చేసి, కిమ్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను అక్కడి నుంచి తొలగించారు.

భద్రత కోసమే ఇలా చేశారా?

కిమ్ సిబ్బంది ఇలా చేయడం వెనుక ఆయన వ్యక్తిగత భద్రత కారణమని భావిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ సేవలు రష్యాకు ఉన్నాయని నమ్ముతారు. ఇటీవల బల్గేరియాలో జరిగిన ఒక సంఘటన దీనికి ఉదాహరణగా చెబుతారు. అక్కడ రష్యా, యూరోపియన్ అసెంబ్లీ అధ్యక్షుడి విమానం జీపీఆర్ఎస్ సిస్టమ్‌ను హ్యాక్ చేసి చంపడానికి ప్రయత్నించిందని ఆరోపణలు ఉన్నాయి. అందుకే కిమ్ సిబ్బంది పుతిన్‌తో భేటీ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

మరోవైపు చైనా నిఘా నుంచి తప్పించుకోవడానికి కిమ్ ఈ చర్యలు తీసుకున్నారని కూడా భావిస్తున్నారు. కిమ్‌కు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ మిగలకుండా ఉండేందుకు ఈ ప్రయత్నాలు చేశారని నివేదికలు చెబుతున్నాయి. ఇదొక దౌత్యపరమైన ప్రోటోకాల్ కాదని, ఒక నేర స్థలంలా ఉందని చూసిన వారంతా అభిప్రాయపడుతున్నారు.