Site icon HashtagU Telugu

Parliament House: పార్లమెంట్ ముందు నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్య

nepal

Resizeimagesize (1280 X 720) 11zon

నేపాల్ ఫెడరల్ పార్లమెంట్ ముందు మంగళవారం ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. ఆ వ్యక్తిని ఇల్లం జిల్లాకు చెందిన ప్రేమ్ ప్రసాద్ ఆచార్యగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన అతన్ని కీర్తిపూర్‌ లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ప్రేమ్ ప్రసాద్ 80 శాతం కాలిన గాయాలతో బాధపడ్డాడని పోలీసులు తెలిపారు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

నేపాల్ పార్లమెంట్ హౌస్ ముందు మంగళవారం నాడు 37 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పార్లమెంట్‌ కార్యకలాపాలు ముగించుకుని ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ భవనం నుంచి బయటకు రాగానే ఆ వ్యక్తి డీజిల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అతని పేరు ప్రేమ్ ప్రసాద్ ఆచార్య, ఇల్లం జిల్లా వాసి. ఖాట్మండులోని మెట్రోపాలిటన్ పోలీస్ కాంప్లెక్స్ ఎస్పీ దినేష్ రాజ్ మైనాలి మాట్లాడుతూ.. ఆచార్యను చికిత్స నిమిత్తం ఖాట్మండులోని సుష్మా మెమోరియల్ బర్న్ ఆసుపత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమించి మృతిచెందాడు. పోలీసులు, అక్కడ నిల్చున్న వారికి విషయం అర్థమై మంటలు ఆర్పే సమయానికి ప్రేమ్ తీవ్రంగా కాలిపోయాడు.

Also Read: Car Hits Bike: దారుణ ఘటన.. కారుతో టూవీలర్ ను ఢీ కొట్టి 12. కి.మీ. లాక్కుపోయాడు..!

ఆచార్య ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేది స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఓ ప్రత్యక్ష సాక్షి వీడియో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. క్లిప్‌లో స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.