Site icon HashtagU Telugu

Moon: మన చంద్రుడికి ఒక టైం జోన్.. సన్నాహాలు వేగవంతం

A Time Zone For Our Moon.. Speed Up The Preparations

A Time Zone For Our Moon.. Speed Up The Preparations

భూమి మీద ఒక్కో దేశంలో .. ఒక్కో ఖండంలో ఒక్కో టైం ఉంటుంది. చంద్రుడిపై (Moon) కూడా అంతే. అక్కడి టైం డిఫరెంట్. చంద్రుడిపైనా వేర్వేరు టైం జోన్లు ఉన్నాయి. అవేమిటి? ఎక్కడెక్కడ ఉన్నాయి? అనేది తెలుసుకునేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఎసా) శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఇటీవల నెదర్లాండ్స్ లో ఒక సమావేశం జరిగింది. ఇందులో చంద్రుడిపై ఒక ప్రత్యేకమైన టైమ్ జోన్‌ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. చంద్రుడిపై కమ్యూనికేషన్, నేవిగేషన్ లాంటివి మెరుగుపరచడానికి ఈ టైమ్ జోన్ ఏర్పాటు చాలా ముఖ్యమని ఎసా భావిస్తోంది.

ఇప్పటికే చంద్రుడిపై (Moon) శాటిలైట్ల లాంచ్‌కు ఎన్నో దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. వీటన్నింటికి టైమ్ జోన్ ఏర్పాటు తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. చంద్రుడిపై పరిశోధనలు చేయాలంటే స్పేస్ క్రాఫ్ట్, కంట్రోలర్స్ లాంటి వాటి సాయం అవసరం. భూమిపై నుండి వెళ్లే సూచనల ద్వారానే అక్కడ శాటిలైట్లు.. వాటి స్థానాలను ఫిక్స్ చేసుకుంటాయి. ప్రస్తుతం చంద్రుడిపై జరుగుతున్న ఆపరేషన్లు.. శాటిలైట్లు లాంచ్ అయిన దేశ టైమ్ జోన్‌ను బట్టి జరుగుతున్నాయి. ఒకేసారి చాలా దేశాలు చంద్రుడిపై తమ ఆపరేషన్స్ చేయాలి అనుకున్నప్పుడు టైమ్ జోన్ విషయంలో ఇబ్బందులు కలుగుతాయి. అందుకే ఎసా చంద్రుడిపై టైమ్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

గడియారాలు వేగంగా..

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం.. భూమి కంటే చంద్రుడిపై గడియారాలు వేగంగా పరిగెత్తుతాయి. ప్రతిరోజూ అక్కడ 56 మైక్రోసెకన్లు పెరుగుతాయి. చంద్ర కక్ష్యలో కంటే చంద్ర ఉపరితలంపై టిక్కింగ్ భిన్నంగా జరుగుతుంది.

చంద్రుడిపై (Moon) ఒక్క రోజు..

చంద్రుడిపై ఒక్క రోజు, భూమిపై ఒక నెలకు సమానం. చంద్రుడు భూమిని ఒక్కసారి చుట్టిరావడానికి 27.3 రోజులు పడుతుంది. భూమి-చంద్రుడు-సూర్యుడు మధ్య వ్యవస్థాపక మార్పుల వల్ల ఒక చంద్రమాసానికి 29.5 రోజులు పడుతుంది. దీనినే చంద్రమాసము అంటారు.

Also Read:  Chillies Tips: ఈ టిప్స్ పాటిస్తే వేసవిలో మిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.