Sunita Williams Salary: శాలరీల విషయంలో ఉద్యోగులకు అన్యాయం.. భూమిపైనే కాదు ఆకాశంలోనూ జరుగుతోంది !! 2024 జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్ అక్కడే చిక్కుకుపోయారు. ఇప్పటిదాకా దాదాపు 9 నెలలు అంతరిక్షంలోనే గడిపారు. అక్కడ అత్యంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. నెలల తరబడి అంతరిక్షంలో ఉండిపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ ఎఫెక్టుతో ఇప్పటికే సునితా విలియమ్స్ బాగా చిక్కుకుపోయారు. అయినా ఆమెకు సాధారణ శాలరీ మాత్రమే ఇస్తారట. 9 నెలలు అంతరిక్షంలో గడిపినందుకు అదనంగా కేవలం రూ.1 లక్ష మాత్రమే అమెరికా ప్రభుత్వం నుంచి ఇస్తారట. ప్రతికూల పరిస్థితుల్లో నేలపై డ్యూటీ చేసే సైనికులకు అమెరికాలో భారీగా శాలరీలు ఇస్తున్నారు. అలాంటిది భూమికి దూరంగా అంతరిక్షంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని 9 నెలలు గడిపినందుకు సునితకు అదనంగా రూ.1 లక్షే ఇస్తారా ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Also Read :Telangana Ropeways : భువనగిరి కోటపై రోప్‌వే.. మరో నాలుగుచోట్ల కూడా..
సునితకు అండగా నెటిజన్లు
మార్చి 19కల్లా సునితా విలియమ్స్ (Sunita Williams Salary) భూమికి తిరిగొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె బరువు తగ్గిపోయింది. 2024 జూన్ 5న అంతరిక్ష యాత్రకు బయలుదేరే సమయంలో సునిత దిగిన ఫొటోను, ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో దిగిన ఫొటోను పరిశీలిస్తే ఈవిషయం అర్థమైపోతుంది. సరైన ఆహారం లేక, ప్రతికూల వాతావరణం నడుమ నెలల తరబడి ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంత రిస్క్ భరించినందుకు భారీగా వేతనాన్ని సునితకు ఆఫర్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని సాహస ఘట్టంగా పరిగణించి ప్రత్యేక అవార్డును కూడా సునితకు ఇవ్వాలని కోరుతున్నారు.
Also Read :Fact Check: పురావస్తు తవ్వకాల్లో దొరికింది.. ఘటోత్కచుడి ఖడ్గమేనా ?
సునిత శాలరీ గురించి..
- సునితా విలియమ్స్ నాసాలో పనిచేస్తున్నారు. నాసా ఉద్యోగులను అమెరికా ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వీరికీ శాలరీలను చెల్లిస్తారు.
- సునితకు ప్రస్తుతం జీఎస్-15 గ్రేడ్ పే స్కేల్ ప్రకారం శాలరీ ఇస్తున్నారు.
- సునిత సాధారణ వార్షిక వేతనం రూ.1.41 కోట్ల దాకా ఉంటుంది.
- సునిత గత 9 నెలలుగా అంతరిక్షంలో ఉన్నందుకు ఎక్స్‌ట్రా శాలరీ పెద్దగా ఇవ్వరు. అదనంగా రోజుకు రూ.350 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన 9 నెలల పేరిట సునితకు ఎక్స్‌ట్రా రూ.1 లక్ష వస్తాయి.