Site icon HashtagU Telugu

Pakistan: పాకిస్థాన్‌లో మూడంతస్తుల భవనం కూలడంతో తొమ్మిది మంది మృతి

Pakistan

Pakistan

Pakistan: పాకిస్థాన్ లో నిత్యం ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉంది. ఇటీవల కాలంలో అక్కడ ప్రమాదాల శాతం ఘననీయంగా పెరిగింది. తాజాగా పాకిస్థాన్ లో మరో ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలలోకి వెళితే..

పాకిస్థాన్‌లోని ముల్తాన్ నగరంలో మంగళవారం మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో తొమ్మిది మంది మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ముల్తాన్‌లోని మొహల్లా జవాదియన్‌లో తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. మృతుల సంఖ్యను ధృవీకరిస్తూ, శిథిలాల కింద చిక్కుకున్న 11 మందిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

గాయపడిన ఇద్దరిని నిష్టర్ ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నారు. మృతుల్లో డానిష్ (15), ఫహీమ్ అబ్బాస్ (40), అమీర్ అలీ (12), వసీం (14), సనూబర్ (40), బుక్తావర్ అమీన్ (18), కోమల్ (13)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Bajireddy : బిఆర్ఎస్ ను వీడడం ఫై బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ క్లారిటీ