Shocking Incident : 7 నెలల గర్భిణిని(31) అత్తింటి వారు దారుణంగా హత్య చేశారు. ఆమెను 25 ముక్కలుగా నరికి సంచుల్లో చుట్టేసి కెనాల్‌లో పడేశారు. తలను ఎవరూ గుర్తు పట్టకుండా నిప్పుల్లో కాల్చేశారు. ఈ రాక్షస ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న దస్కా పట్టణ శివారులోని కోట్లి మార్లాన్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలివీ..
Also Read :Cow Dung : ఆవుపేడలో రూ.20 లక్షలు.. దొరికిపోయిన చోరీ సొత్తు
ఆమె పేరు జహ్రా. వయసు 31 ఏళ్లు. భర్త పేరు ఖదీర్. వీరికి 2020 సంవత్సరంలో పెళ్లయింది. ఈ దంపతులకు ఇప్పటికే ఒక పాప ఉంది. ప్రస్తుతం జహ్రా 7 నెలల నిండు గర్భిణి. ఖదీర్ విదేశాల్లో జాబ్ చేస్తున్నాడు. అతడు పాకిస్తాన్‌లో లేడు. ఇంట్లో జహ్రా అత్త.. జహ్రా భర్త అక్కాచెల్లెళ్లు ఉంటారు. జహ్రాకు(Shocking Incident), తన అత్త మామలతో పలు విషయాల్లో గొడవ జరిగింది. దీంతో జహ్రాపై అత్తమామలు కక్ష పెంచుకున్నారు. ఇంట్లో జహ్రా నమాజ్ చేస్తుండగా.. ఆమె అత్త సుఘ్రా బీబీ, సుఘ్రా బీబీ కూతురు యాస్మీన్ దాడి చేశారు. దిండుతో జహ్రాను ఊపిరాడకుండా చేసి మర్డర్ చేశారు. ఈక్రమంలో జహ్రాను పట్టుకున్న వారిలో సుఘ్రా బీబీ మనవడు అబ్దుల్లా, మరో బంధువు నవీద్ ఉన్నారు.
Also Read :Bomb Prank : యూట్యూబ్ చూసి బాంబు తయారుచేసి.. టీచర్ కుర్చీ కింద పేల్చారు
మర్డర్ చేసిన తర్వాత జహ్రాను 25 ముక్కలుగా నరికి వివిధ బ్యాగుల్లో ప్యాక్ చేసి సమీపంలోని కెనాల్‌లో వేయించారు. తలను నిప్పుల్లో కాల్చేసి గుర్తుపట్టనంతగా మార్చారు. అనంతరం జహ్రా అత్తింటి వారు వెళ్లి పోలీసులకు ఒక కంప్లయింట్ ఇచ్చారు. జహ్రా ఎవరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి పారిపోయిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తన కూతురి అత్తింటి వారిపై అనుమానం ఉందని జహ్రా తండ్రి పోలీసులకు ఒక కంప్లయింట్ ఇచ్చారు. ఆయన చెప్పిన కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు నిజాన్ని రాబట్టారు. జహ్రా అత్తమామలను విచారించగా నిజాన్ని చెప్పారు. మర్డర్ తామే చేశామని ఒప్పుకున్నారు. హత్యలో పాల్గొన్న నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.