Nightclub Fire : నైట్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏకంగా 51 మందికిపైగా సజీవ దహనమయ్యారు. 100 మందికిపైగా గాయాలపాలయ్యారు. నైట్ క్లబ్‌ను మంటలు అలుముకున్న సమయంలో లోపల దాదాపు 1500 మంది ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున ఐరోపా ఖండంలోని నార్త్ మెసిడోనియా దేశంలో ఉన్న కొకాని పట్టణంలో చోటుచేసుకుంది.
Also Read :Black Magic Vs 1500 Crores: పుర్రెలు.. లీలావతి ఆస్పత్రి.. రూ.1500 కోట్ల స్కామ్
నైట్ క్లబ్‌లో పార్టీ జరిగే క్రమంలో మండే స్వభావం కలిగిన వస్తువులను వాడినట్లు తెలిసింది. వాటి వల్లే నైట్ క్లబ్ భవనం సీలింగ్‌కు మంటలు అంటుకున్నాయని వెల్లడైంది. కొన్న గంటల పాటు ఈ మంటలు కొనసాగాయని సమాచారం. దీన్నిబట్టి నైట్ క్లబ్(Nightclub Fire) భవనానికి ఎంతగా నష్టం జరిగి ఉంటుందో మనం అంచనా వేసుకోవచ్చు. నార్త్ మెసిడోనియా రాజధాని స్కోప్జేకు దాదాపు 100 కి.మీ దూరంలోని కొకాని పట్టణంలో ఈ ఘటన జరిగింది.
Also Read :YouTuber Harsha Sai: హర్ష సాయిపై కేసు.. ఇతడు ఎవరు ? ఎందుకీ కేసు ?
మరో 31 మంది మృతి.. 101 మందికి గాయాలు
యెమన్‌లోని హూతీ స్థావరాలపై అమెరికా సైన్యం భీకర దాడులు చేసింది. యెమెన్ దేశంలోని సనా, సదా, అల్ బైదా, రాడా నగరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. దీంతో 31 మంది యెమన్ పౌరులు చనిపోయారు. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువ మంది ఉన్నారు. 101 మంది గాయపడగా, వారిని ఆస్పత్రుల్లో చేర్పించారు. ఈవివరాలను హౌతీ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలు, విమానాలపై హూతీలు దాడులు చేస్తుంటే ఇక చూస్తూ ఊరుకునేది లేదని అమెరికా సెంట్రల్ కమాండ్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తూ అమెరికా కూడా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని యెమన్ హౌతీలు ఆరోపించారు. ఈ దాడులతో తాము వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. తుదిశ్వాస దాకా ఇజ్రాయెల్‌పై పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. పాలస్తీనా ప్రజలకు తమ మద్దతు ఉంటుందని హౌతీలు తేల్చి చెప్పారు.