Site icon HashtagU Telugu

Plane Explosion : రన్‌వేపై ల్యాండ్ అవుతూ.. విమానం పేలి 179 మంది మృతి

Plane Explosion South Korean Airport

Plane Explosion : ఇవాళ  తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రన్‌వేపై ల్యాండ్ అవుతున్న  ‘ది జేజు ఎయిర్‌ ఫ్లైట్‌’కు చెందిన  బోయింగ్‌ 737-800 శ్రేణి విమానం (7c2216) అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో విమానంలో భారీగా మంటలు చెలరేగి.. అందులోని 179  మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ దారుణ ప్రమాదం దక్షిణ కొరియాలోని ముయాన్‌ ఎయిర్‌పోర్టు‌లో చోటుచేసుకుంది. 7c2216 నంబరు కలిగిన విమానం థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి దక్షిణ కొరియాలోని ముయాన్‌ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అది రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం బారినపడింది. ప్రమాదం జరిగిన టైంలో విమానంలో(Plane Explosion) మొత్తం 181 మంది ఉన్నారు. వీరిలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది. విమానంలోని కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బతికారు.

Also Read :Nitish Kumar Reddy Century: వాషింగ్టన్ సుందర్ సహకారంతోనే నితీష్ సూపర్ సెంచరీ

విమానంలోని ల్యాండింగ్‌ గేర్‌ ఫెయిల్ అయినందు వల్లే  ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. విమానం ల్యాండ్‌ కావడానికి యత్నిస్తుండగా ల్యాండింగ్‌ గేర్‌ పనిచేయలేదు. దీంతో అది అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లి ఎయిర్‌పోర్టు రన్‌వే‌పై ఉండే రక్షణ గోడను  ఢీకొట్టింది. రక్షణగోడను ఢీకొన్న వెంటనే విమానంలోని ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు చెలరేగాయి. ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లే.. విమానంలోని ల్యాండింగ్ గేర్  మొరాయించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో విమానం పూర్తిగా కాలిపోయిది. ఈ విమాన ప్రమాదంపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్‌ సాంగ్‌ మోక్‌ స్పందించారు. తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఇంటీరియర్‌, ల్యాండ్‌ మినిస్టర్లకు, పోలీసులు, అగ్నిమాపక శాఖకు మార్గదర్శకాలు జారీ చేశారు. ముయాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు. ఇటీవల కాలంలో బ్రెజిల్ దేశంలోనూ పెద్దసంఖ్యలో విమాన ప్రమాదాలు జరిగాయి. వివిధ విమాన ప్రమాద ఘటనల్లో వందలాది మంది చనిపోతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. విమానాల్లో ఉంటే సెక్యూరిటీ అండ్ సేఫ్టీ టెక్నాలజీ మరింత అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదాలు నొక్కి చెబుతున్నాయి.

Also Read :Telangana TDP : తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ ఆ జిల్లా నుంచే!