Site icon HashtagU Telugu

47 Buried : 47 మంది సజీవ సమాధి.. మంచుచరియల బీభత్సం

47 Buried

47 Buried

47 Buried : చైనా నైరుతి భాగంలోని పర్వత ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 47 మంది సజీవ సమాధి(47 Buried) అయ్యారు. యున్నాన్ ప్రావిన్స్‌లోని జెన్‌క్యాంగ్ కౌంటీలో చోటు చేసుకున్న ఈ ఘటనలో 18 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆ ప్రాంతంలోని 200 మందికిపైగా ప్రజలు నిలువ నీడను కోల్పోయి నిరాశ్ర యులయ్యారు. సంఘటనా స్థలంలో 200 మందికిపైగా రెస్క్యూ వర్కర్లతో పాటు డజన్ల కొద్దీ ఫైర్ ఇంజన్లు,  ఇతర పరికరాలతో సహాయక చర్యలను ప్రారంభించారు.

We’re now on WhatsApp. Click to Join.

సోమవారం ఉదయం జెన్‌క్యాంగ్‌లో మైనస్ నాలుగు డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది.  కొండచరియలు విరిగిపడటానికి కారణం ఏమిటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఏం జరిగిందో నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబరులో గ్వాంగ్జీ నగరం దక్షిణ ప్రాంతంలో తుఫానుల ప్రభావంతో కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మరణించారు. గతేడాది ఆగస్టులో జియాన్ నగరంలోనూ కొండచరియలు విరిగిపడి 20 మందికిపైగా మరణించారు. అంతకుముందు జూన్‌లో  నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి 19 మంది మరణించారు.

Also Read: Ayodhya – Bala Ramudu : బాల రాముడు ఎలాంటి అల్లరి, చిలిపి పనులు చేసాడో తెలుసా..?

భారతీయులకు 1.8 లక్షల పైచిలుకు చైనా వీసాలు

గతేడాది భారతీయులకు 1.8 లక్షల పైచిలుకు వీసాలు జారీ చేసినట్టు భారత్‌లోని చైనా ఎంబసీ ప్రతినిధి తాజాగా తెలిపారు. భారతీయులకు వీసాల జారీ సులభతరం చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. చైనీయుల విషయంలో భారత్ కూడా ఇదే రీతిన స్పందిస్తుందని తాము ఆశిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ల విధాన తొలగింపు, వేలిముద్రల నుంచి మినహాయింపు, తాత్కాలిక ఫీజు తగ్గింపు వంటి చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. భారత్ కూడా చైనీయులకు సాధారణ వీసా విధానాన్ని పునరుద్ధరించాలని తాము ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు పెంపొందించేందుకు ఈ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

కాగా, భారత్ చైనీయులకు టూరిస్టు వీసాలను నిలిపివేసినట్టు 2022లో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ తమ సంఘం సభ్యులకు తెలిపింది. చైనీయులకు జారీ చేసిన టూరిస్టు వీసాలు చెల్లవని కూడా చెప్పింది. అయితే, భారత్ జారీ చేసిన నివాసార్హత పర్మిట్లు ఉన్న భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాలీ ప్యాసింజర్లకు ఇండియాలో ప్రవేశించేందుకు అనుమతి ఉందని పేర్కొంది. ఓసీఐ, పీఐఓ కార్డులు ఉన్న వారు, డిప్లొమేటిక్ పాస్‌పోర్టులు ఉన్న వారికీ ఇండియాలో ప్రవేశించేందుకు అనుమతి ఉందని పేర్కొంది.