Earthquake : ఇవాళ తెల్లవారుజామున తైవాన్‌లో భారీ భూకంపం వచ్చింది. తైవాన్ దక్షిణ ప్రాంతంలో దాదాపు 6.4 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. భూకంపం వల్ల చోటుచేసుకున్న వివిధ ఘటనల్లో 27 మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. భూప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొన్ని ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు వంకర పోయాయి. తైవాన్ రాజధాని తైపీలో కూడా భూప్రకంపలు వచ్చాయి. ఈవిషయాన్ని స్థానికులు మీడియాకు తెలిపారు. నాన్ క్సీ జిల్లాలో ఓ ఇళ్లు కూలిపోయింది. దాని కింద ఇరుక్కును ముగ్గురిని అధికార వర్గాలు రెస్క్యూ టీమ్‌ల సాయంతో రక్షించాయి. ఈ జిల్లాలోని చాలా ఇళ్ల సీలింగ్‌లకు పగుళ్లు వచ్చాయి. పలుచోట్ల ప్రధాన రహదారులు, వంతెనలు కూలిపోయాయి. ఈ భూకంప కేంద్రాన్ని యుజింగ్ పట్టణం నుంచి 12 కిలోమీటర్లు ఉత్తరంగా, 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
Also Read :Midday Meal Scheme : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. ఎందుకంటే ?
జనం పరుగులు..
భూప్రకంపనలను ఫీల్ కాగానే ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. తెల్లవారుజామున కొన్ని గంటల పాటు రోడ్లపైనే గడిపారు. 2024 సంవత్సరం ఏప్రిల్‌లో తైవాన్ పర్వత తూర్పు తీరంలోని హువాలియన్ ప్రాంతంలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. అప్పట్లో దాదాపు 13 మంది చనిపోగా, 1,000 మందికి పైగా గాయాలపాలయ్యారు. తాజా భూకంపం నేపథ్యంలో తైవాన్ ప్రజలు మరోసారి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు.
Also Read :IT Raids : దిల్‌రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు
తైవాన్‌కు ఎందుకింత రిస్క్ ?
- భూకంపాల ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల్లో తైవాన్(Earthquake) ఒకటి. జపాన్‌కు కూడా భూకంపాల రిస్క్ ఎక్కువ.
- పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో తైవాన్ దేశం ఉంది. ఈ ఏరియాలో భూమి అంతర్భాగంలో టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులు ఉంటాయి. అవి ఒకదాన్నొకటి నిత్యం తాకుతుంటాయి. ఈక్రమంలో టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల్లో ఏ మాత్రం కుదుపులు జరిగినా.. తైవాన్‌లో భూకంపం వచ్చేస్తుంది.
- అందుకే తైవాన్‌లో తరచుగా భూకంపాలు వస్తుంటాయి.
- 1999 సెప్టెంబర్ 21న తైవాన్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించగా దాదాపు 2,400 మంది చనిపోయారు.వేలాది మంది గాయపడ్డారు.
- 2016లో వచ్చిన భూకంపంలో 100 మందికిపైగా చనిపోయారు.