ఇజ్రాయెల్ (Israeli ) సేనలు గాజా, లెబనాన్ (Lebanon ) పై దాడులు ఆపడం లేదు. తాజాగా జబాలియా శరణార్థ శిబిరంపై ఇజ్రాయెల్ నాలుగో రోజూ భీకర దాడులను కొనసాగించింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. సెంట్రల్ గాజాలోని శరణార్థి శిబిరంలో ఉన్న పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో 28 మందికిపైగా మరణించారు (killed ). మరో 54 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లెబనాన్‌లోని ఇరాన్ మద్దతు కలిగిన హెజ్‌బొల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని సమాచారం.
ఉత్తర గాజాలో సుమారు 4 లక్షల మంది భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాయపడిన వేలాది మందితో అక్కడి హాస్పటల్స్ కిటకిటలాడుతున్నట్లు పేర్కొంది. పైగా సదరు హాస్పటల్స్ సిబ్బంది, మందుల కొరత తీవ్రంగా ఉన్నాయని వెల్లడించింది. నిరాశ్రయులైన మహిళలు, చిన్నారులు సదరు హాస్పటల్లోనే ఆశ్రయం పొందుతున్నట్లు ఐరాస తెలిపింది. మరో వైపు హెజ్‌బొల్లా కూడా ప్రతిదాడులు చేసింది. గంటల వ్యవధిలో సుమారు 40 రాకెట్లతో ఉత్తర ఇజ్రాయెల్ పై దాడి చేసింది. వాటిలో కొన్నింటిని ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ నేలకూల్చగా మరికొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో పడినట్లు ఐడీఎఫ్ తెలిపింది.
Read Also : World Egg Day : ప్రపంచ గుడ్డు దినోత్సవం.. అలాంటి రోజు ఎందుకు..?