US Army – Gaza Border : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ కు మద్దతుగా 2వేల మంది అమెరికా సైనికులను ఇజ్రాయెల్ బార్డర్ ఏరియాలలో మోహరిస్తామని ప్రకటించింది. ప్రత్యేకించి లెబనాన్, ఈజిప్ట్, సిరియా, గాజాతో ఉన్న ఇజ్రాయెల్ బార్డర్ లో అమెరికా దళాలు ఉంటాయని అంటున్నారు. అమెరికా తన సైనికుల సంఖ్యను మరింత పెంచే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇజ్రాయెల్ కు బయలుదేరేందుకు రెడీ కావాలంటూ ఇప్పటికే 2వేల మందికిపైగా సైనికులకు అమెరికా రక్షణశాఖ ఆదేశాలు జారీ చేసిందని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
బుధవారం ఇజ్రాయెల్ లో బైడెన్ పర్యటన
మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం రోజు ఇజ్రాయెల్ కు పర్యటించనున్నారు. హమాస్ దాడితో జరిగిన నష్టంపై ఇజ్రాయెల్ కు నైతిక మద్దతును ప్రకటించేందుకు ఆయన ఆ దేశంలో పర్యటించనున్నారు. హమాస్ ను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ కు పూర్తిగా సహకరిస్తామని బైడెన్ అంటున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ పర్యటన సోమవారం రాత్రి ముగిసింది. ఈనేపథ్యంలో వెంటనే జో బైడెన్ ఇజ్రాయెల్ పర్యటనపై ప్రకటన విడుదల కావడం గమనార్హం. పాలస్తీనియన్ల భవిష్యత్తుపై అక్టోబర్ 21న ఈజిప్టులో జరగనున్న అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశంలో బైడెన్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే గాజా అంశంపై ఐక్యరాజ్యసమితితో పాటు జోర్డాన్, పాలస్తీనా అథారిటీ, ఇజ్రాయెల్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసితో బైడెన్ ఫోన్ లో సంభాషించారు. గాజాకు మానవతా సాయం అందేలా చూడాలని ఇజ్రాయెల్ ను కోరారు. గాజాలోకి చొరబడి అక్కడే ఉండిపోవాలనే ఆలోచన ఉంటే విరమించుకోవాలని ఇజ్రాయెల్ కు కూడా ఆయన సూచించారు.
Also Read: Gay Marriage : సేమ్ సెక్స్ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తారా ? ‘సుప్రీం’ తీర్పు నేడే
గాజాలో దారుణ పరిస్థితులు
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో మరణించిన సామాన్య పాలస్తీనా పౌరుల సంఖ్య 3వేలు దాటింది. దాదాపు 11వేల మందికిపైగా గాయాలపాలయ్యారు. ఎంతో మంది పరిస్థితి విషమంగా ఉంది. నీరు, నిత్యావసరాలు లేక గాజావాసులు (US Army – Gaza Border) అల్లాడుతున్నారు. అయినా గాజా సీజ్ ను ముగించేది లేదని, నిత్యావసరాలను గాజాలోకి వెళ్లనివ్వబోమని ఇజ్రాయెల్ అంటోంది.