Site icon HashtagU Telugu

Yahoo! Layoff: యాహూ లో 20% ఉద్యోగుల ఉద్వాసన!

Yahoo!

Yahoo

కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల (Layoffs) పరంపర కొనసాగుతోంది. తాజాగా యాహూ (Yahoo!) సైతం తమ సిబ్బందిని తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. దాదాపు 20 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన (Layoffs) పలకనున్నట్లు గురువారం ప్రకటించింది. ముఖ్యంగా యాడ్‌- టెక్‌ విభాగంలోని ఉద్యోగుల్లో సగం మంది ఇంటిబాట ..

గురువారం ఆఫీసు కార్యకలాపాలు ముగిసే సమయానికే కంపెనీలో 12 శాతం అంటే 1,000 మందిని తొలగిస్తున్నట్లు (Layoffs) యాహూ తమ ఉద్యోగులకు తెలియజేసింది. మరో 8 శాతం అంటే 600 మందికి వచ్చే ఆరు నెలల్లో ఉద్వాసన పలుకుతామని పేర్కొంది. ఆర్థిక పరిస్థితుల వల్ల ఉద్యోగులను తొలగించడం లేదని యాహూ సీఈఓ జిమ్‌ లైన్‌జోన్‌ చెప్పడం గమనార్హం. లాభదాయకతలేని కంపెనీ బిజినెస్‌ అడ్వర్టైజింగ్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తమ కీలక ప్రకటనల వ్యాపారమైన డీఎస్‌పీలో పెట్టుబడులను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు యాహూ (Yahoo!) తెలిపింది. ద్రవ్యోల్బణం, మాంద్యం నేపథ్యంలో చాలా సంస్థలు వాణిజ్య ప్రకటనలపై వ్యయాన్ని భారీగా తగ్గించుకుంటున్నాయి. యాహూ (Yahoo)ను 2021లో ప్రైవేటు ఈక్విటీ సంస్థ ‘అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌’ ఐదు బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Also Read:  Children Stress: పిల్లలపై పరీక్షల ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేసి చూడండి!