Talibans Vs Pakistan : తాలిబన్లు మరోసారి యుద్ధానికి రెడీ అయ్యారు. ఈసారి తాలిబన్లు తలపడబోయేది పొరుగుదేశం పాకిస్తాన్‌తో!! ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థ శిబిరాలపై పాకిస్తాన్ ఆర్మీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 46 మంది ఉగ్రవాదులు చనిపోయారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన తాలిబన్ ప్రభుత్వం.. ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్‌కు దాదాపు 15వేల మంది తాలిబన్ ఫైటర్లను తాలిబన్ సర్కారు పంపుతోంది. వీరంతా ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్, కాందహార్, హెరాత్ ప్రావిన్స్‌ల నుంచి పాకిస్తాన్‌కు చెందిన ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ను కలిపే మీర్ అలీ బార్డర్ వైపుగా కదులుతున్నట్లు తెలిసింది.
Also Read :Electoral Dataset : లోక్‌సభ పోల్స్ డేటాసెట్ రిలీజ్ చేసిన ఈసీ.. అందులో ఏముందంటే..
ఒకప్పుడు పాకిస్తాన్ పెంచి పోషించిన తాలిబన్లే.. ఇప్పుడు పాకిస్తాన్‌పై(Talibans Vs Pakistan) తిరగబడేందుకు రెడీ అయ్యారు. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూల్చేందుకు.. అమెరికా రంగంలోకి దిగింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని కరుడుగట్టిన ఇస్లామిక్ వాదులను కూడగట్టింది. ఆ ఇస్లామిక్ వాదులతో ఏర్పాటైన గ్రూప్ పేరే తాలిబన్లు. తాలిబన్లకు అమెరికా ఫండింగ్‌తో పాకిస్తాన్ ఆనాడు ట్రైనింగ్ ఇచ్చింది. అనంతరం వారిని ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రజాస్వామిక ప్రభుత్వంపైకి ఉసిగొల్పింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో అధికార పీఠంపై ఉన్న తాలిబన్లు.. పాకిస్తాన్‌కు ధీటైన జవాబు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
Also Read :Bal Puraskars : ఏపీ బాలిక జెస్సీకి రాష్ట్రీయ బాల పురస్కార్.. మరో 16 మందికి కూడా..
ఓ వైపు పాకిస్తాన్‌కు ఆయుధాలు అమ్ముతున్న చైనా.. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌తోనూ దోస్తీ చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా ఏం చేస్తుంది ? తన మిత్రదేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లను శాంతింపజేస్తుందా ? యుద్ధం చేసుకునేలా ఆయుధాలను అందిస్తుందా ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2011లో అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. ‘‘మన పెరట్లో పాముల్ని పెంచుకొని.. అవి పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించడం అవివేకం’’ అని పాకిస్తాన్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే పాకిస్తాన్ ఎదుర్కొంటోంది.