Site icon HashtagU Telugu

15 Dead: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం

Mexico Bus Crash

Road accident

ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పసిఫిక్ తీరప్రాంత రాష్ట్రమైన నయారిత్‌లోని హైవేపై పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో కనీసం 15 మంది మృతి (15Dead) చెందగా, 47 మంది (47 injured) గాయపడ్డారు. ఈ మేరకు శనివారం అధికారులు సమాచారం అందించారు. ప్రయాణికులంతా రాష్ట్రంలోని లియోన్ నగరానికి చెందిన వారని ఆయన చెప్పారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, ఈ సందర్భంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మెక్సికోలో స్నేహితులు, బంధువులు లేదా పొరుగువారితో విహారయాత్రకు బస్సును అద్దెకు తీసుకోవడం సర్వసాధారణం.

Also Read: Migrant boat sinks: పడవ బోల్తా.. 13 మంది మృతి

హైవేలోని గ్రామీణ ప్రాంతంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగిందని నయారిత్‌లోని స్థానికులు తెలిపారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. పర్యాటకులు గుయాబిటోస్ నుండి ఉత్తర నగరమైన ప్యూర్టో వల్లర్టాకు తిరిగి వస్తున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. గాయపడిన వారిలో 45 మంది స్థానిక ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మెక్సికోలో ఇదివ‌ర‌కు ఇలాంటి ప్ర‌మాదాలు చాలానే చోటుచేసుకున్నాయి. అద్దె బస్సుల నిర్వహణ సరిగా లేకపోవడం, చెడు వాతావరణం లేదా రహదారి పరిస్థితులు లేదా అతివేగం కారణంగా ఇటువంటి ప్రమాదాలు తరచుగా సంభవిస్తున్నాయి.