130 Nukes Warning : పాకిస్తాన్ ప్రభుత్వంలోని మంత్రులు, కీలక నేతలు రెచ్చిపోతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. భారత్‌పై ఎడాపెడా నోరు పారేసుకుంటున్నారు. తాజాగా పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా సూపర్ పవర్ భారత్‌కే వార్నింగ్ ఇచ్చాడు. ‘‘భారత్‌పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచాం’’ అని బహిరంగ బెదిరింపులకు దిగాడు. ‘‘భారత్‌పై వేసేందుకు ఘోరీ, షాహీన్, ఘజ్నవి క్షిపణులు కూడా తీసి ఉంచాం. భారత్ సింధూ జలాలను నిలిపివేస్తే, పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపర్చాం. భారత్(130 Nukes Warning) కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్టుగా భావిస్తాం. మా దగ్గరున్న ఆయుధాలు, క్షిపణులు ప్రదర్శన కోసం కాదు. అవి భారత్‌నే లక్ష్యంగా చేసుకుంటాయి’’ అని హనీఫ్ అబ్బాసీ కామెంట్స్ చేశారు.
Also Read :POK Floods : పాక్ ఆక్రమిత కశ్మీరులో వరదలు.. భారత్ పనే అంటున్న పాక్
ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధమే : హనీఫ్ అబ్బాసీ
‘‘పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే తీవ్ర పరిణామాలను భారత్ ఇప్పటికే అర్థం చేసుకుంది. మేం రెండు రోజులు గగనతలం మూసేస్తే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో కూరుకుపోయింది. మరో 10 రోజులు మేం ఇలానే చేస్తే ఏకంగా భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయి. ఇబ్బందులు ఎదుర్కోవడానికి మేమూ సిద్ధమవుతున్నాం’’ అని పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ వ్యాఖ్యానించారు.
Also Read :ED Office Fire: ఈడీ ఆఫీసు భవనంలో భారీ అగ్నిప్రమాదం
వాళ్ల కోసమే చెత్తపనులు చేశాం : పాక్ రక్షణ మంత్రి
‘‘అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే గత మూడు దశాబ్దాలుగా మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం. అయితే అది పొరబాటు అని అర్థమైంది. దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో చేరకపోయి ఉంటే, మాకు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉండేది. పాక్‌లోని గత ప్రభుత్వాలు తప్పులు చేశాయని భావిస్తున్నాను’’ అని ఇటీవలేే పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు.