Secret Service Agent: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడు డీజే డానియెల్‌కు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంటుగా ఉద్యోగం ఇచ్చారు. ఇటీవలే అతడికి ఐడీ కార్డు, యూనిఫామ్‌లను కూడా జారీ చేశారు. ఈ కుర్రాడు తాజాగా వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసుకు వెళ్లి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. తనకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి, చిరకాల వాంఛను తీర్చినందుకు ట్రంప్‌కు డీజే డానియేల్ ధన్యవాదాలు చెప్పాడు. ఈక్రమంలో ఉద్వేగంతో ట్రంప్‌ను ఆ కుర్రాడు కౌగిలించుకున్నాడు. ‘‘నీకు ఏం కాదు.. మేం ఉన్నాం కా’’ అంటూ ఆ అబ్బాయికి ట్రంప్ ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను వైట్ హౌస్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో పోస్ట్ చేశారు. డీజే డానియెల్ వెంట అతడి కుటుంబ సభ్యులు కూడా ఓవల్ ఆఫీసుకు వెళ్లారు. వారందరితోనూ ట్రంప్ ఆప్యాయంగా కలిశారు. డానియేల్‌కు తగిన వైద్య చికిత్స అందించాలని ట్రంప్ సూచించారు.
Also Read :Congress : ఎమ్మెల్సీ పోల్స్‌లో కాంగ్రెస్ పరాభవానికి ముఖ్య కారణాలివే..
డీజే డానియెల్ ఎవరు ? ఎందుకీ పోస్ట్ ?
- డీజే డానియెల్(Secret Service Agent) వయసు 13 ఏళ్లు. అతడు టెక్సాస్ వాస్తవ్యుడు.
- 2018లో ఈ కుర్రాడికి బ్రెయిన్ క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఇతడు క్యాన్సర్‌ను జయించాడు.
- డీజే ఇంకా కొన్ని నెలలే బతుకుతాడని డాక్టర్లు చెప్పారు.
- అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కావాలి అనేది డీజే డానియెల్ చివరి కోరిక.
- అమెరికా అధ్యక్షుడు కావడానికి ముందే ఈవిషయం ట్రంప్‌కు తెలిసింది. ట్రంప్ ఎన్నికల్లో గెలిచాక, అమెరికా కాంగ్రెస్ తొలి సంయుక్త సమావేశంలో డీజే డానియెల్ విజయగాథను స్వయంగా చెప్పారు. అతడి చివరి కోరికను నెరవేరుస్తానని ప్రకటించారు.
- ఇచ్చిన మాట ప్రకారమే.. డీజే డానియెల్‌ను సీక్రెట్ సర్వీస్ గౌరవ ఏజెంట్‌గా ట్రంప్ నియమించారు.