Site icon HashtagU Telugu

Plane Crash : ఘోర విమాన ప్రమాదం.. 12 మంది మృతి

Plane Crash

Plane Crash

Plane Crash : బ్రెజిల్‌లో విమాన ప్రమాదాలు ఆగడం లేదు. సాంకేతిక లోపాలతో విమానాలు మార్గం మధ్యలోనే నేలకూలి పోతున్నాయి. గత నెలలో ఆ దేశంలో విమానం కూలిన ఘటనలో 14 మంది చనిపోగా.. తాజాగా మరో ప్రమాదం జరిగింది. ఎకర్ రాష్ట్ర రాజధాని రియో బ్రాంకోలోని ప్రధాన విమానాశ్రయం సమీపంలో చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈవివరాలను రాష్ట్ర గవర్నరు గ్లాడ్సన్ కామెలీ వెల్లడించారు. అమెజాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. విమానం కూలిపోయిన ప్రదేశం.. విమాన శకలాలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన 12 మందిలో ఒక శిశువు, 9 మంది పెద్దలు, పైలట్, కో-పైలట్ ఉన్నారు. అది  సింగిల్ ఇంజిన్ కలిగిన ‘సెస్నా కారవాన్’ మోడల్ విమానమని అధికారులు తెలిపారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రియో బ్రాంకోలోని ప్రధాన విమానాశ్రయం సమీపంలో కూలిందని(Plane Crash) చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే నెల మొదటివారంలో జింబాబ్వేలో  జరిగిన ఘోర విమాన ప్రమాదంలో భారత సంతతి బిలియనీర్‌, ఆయన కుమారుడితో పాటు నలుగురు చనిపోయారు., భారత్‌కు చెందిన హర్పాల్ సింగ్ రంధావా ‘రియోజిమ్‌’ పేరుతో మైనింగ్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీ నికెల్‌, రాగి తదితర లోహాలను శుద్ధి చేస్తుంటుంది. జింబాబ్వే రాజధాని హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ప్రైవేట్‌ జెట్‌లో వెళ్తున్న సమయంలో మషావా ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఆరుగురు మరణించారు.

Also Read: Train Accident : ఏపీలో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు