Site icon HashtagU Telugu

12 killed: పెరూలో ఉద్రిక్తత.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో 12మంది మృతి

protest

1673324640

పెరూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న కొందరు నిరసనకారులు విమానాశ్రయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునే క్రమంలో భద్రతా సిబ్బందికి, వారికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 12 మంది మరణించారని (12 killed) అధికారులు తెలిపారు. ఈ ఘటన పెరూలోని జులియాకా ప్రాంతంలో జరిగింది. అయితే అధ్యక్షురాలు డీనా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

లిమా దేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆగ్నేయ పెరూలో సోమవారం జరిగిన నిరసనల్లో కనీసం12 మంది మరణించారు. ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ బహిష్కరించబడిన మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోకి విధేయత చూపుతున్నారు. పెరూ మానవ హక్కుల సంస్థ ఈ మరణాలపై విచారణకు పిలుపునిచ్చింది. వీరిలో భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 12 మంది చనిపోయారు. కాస్టిల్లో బహిష్కరణ, అరెస్టు తరువాత డిసెంబర్ ప్రారంభం నుండి నిరసనలలో ఇంతకు మునుపు ఎన్నడూ లేనంత మంది ప్రజలు మరణించారు.

Also Read: Unmarried Mother Throws NewBorn: హృదయ విదారక ఘటన.. శిశువును మూడో అంతస్తు నుంచి విసిరేసిన తల్లి

నివేదికల ప్రకారం.. జూలియాకాలో ప్రాణాలు కోల్పోయిన 12 మందిలో ఒక మైనర్ కూడా ఉన్నాడు. సమీపంలోని చుక్విటో నగరంలో మరొక వ్యక్తి మరణించాడు. అక్కడ నిరసనకారులు హైవేను అడ్డుకున్నారు. మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెరుగుతున్న నిరసనల మధ్య 2024లో ఓటింగ్ నిర్వహిస్తామని ప్రెసిడెంట్ డినా బోలువార్టే హామీ ఇచ్చారు. గత వారం సెలవుల విరామం తర్వాత నిరసనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ముందస్తు ఎన్నికలు, కాస్టిల్లో విడుదల చేయాలని నిరసనకారులు కొత్త ప్రెసిడెంట్ డినా బోలువార్టే రాజీనామా చేయాలని, రాజ్యాంగంలో మార్పులకు పిలుపునిచ్చారని అక్కడి వార్త సంస్థ పేర్కొంది.