మయన్మార్(Myanmar)లో సంభవించిన భారీ భూకంపం(Earthquake ) కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. మార్చి 28న సంభవించిన 7.7 తీవ్రత గల భూకంపం దేశవ్యాప్తంగా విధ్వంసాన్ని సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం.. మయన్మార్ ప్రభుత్వ ప్రకటనలో 1,700 మంది మరణించారని, 3,400 మంది గాయపడ్డారని వెల్లడించారు. కానీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Kodali Nani: కొడాలి నాని ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ముంబైకి తరలింపు!
ఈ ప్రకృతి వైపరీత్యం ముఖ్యంగా మాండలే, సాగైంగ్, బాగో, నైపీడా ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. రహదారులు, వంతెనలు, భవనాలు విరిగిపోవడం, విద్యుత్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మయన్మార్ రెడ్ క్రాస్ నివేదిక ప్రకారం.. 50,000 కుటుంబాలు ఈ భూకంపం ప్రభావానికి లోనయ్యాయని , అనేక ప్రదేశాల్లో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అంటున్నారు.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఈ భూకంప ప్రభావం 15 లక్షల మందికి పైగా విస్తరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు 10,000 మంది మరణించినట్లు ఎటువంటి అధికారిక సమాచారం లేదు. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత మాత్రమే ఖచ్చితమైన మృతుల సంఖ్య తెలియనుంది.