Zomato: రూ.133 తో జాక్ పాట్ కొట్టిన మహిళ, పాపం జొమాటో

శీతల్ అనే మహిళ 31 ఆగస్టు 2023న జొమాటో నుండి మోమోస్‌ని ఆర్డర్ చేసింది. అలాగే గూగుల్ పే ద్వారా రూ. 133.25 చెల్లించారు. ఆర్డర్ ఇచ్చిన 15 నిమిషాల తర్వాత, ఆ మహిళకు తన ఆర్డర్ డెలివరీ అయినట్లు మెసేజ్ వచ్చింది. కానీ ఆమెకు ఆర్డర్ డెలివరీ కాలేదు.

Zomato:  ఫుడ్ డెలివరీ యాప్‌లకు సంబంధించి ప్రతిరోజూ ఆసక్తికరమైన వార్తలు వింటూనే ఉంటాము. జొమాటో(Zomato)యాప్‌ నుంచి మోమోస్‌ను ఆర్డర్‌ చేసిన ఆసక్తికర కేసు కర్ణాటకలోని బెంగళూరు నుంచి వెలుగులోకి వచ్చింది. నిజానికి బెంగళూరులోని ఒక మహిళ జొమాటో నుండి మోమోస్‌ని ఆర్డర్ చేసింది. కానీ ఆర్డర్ డెలివరీ కాలేదు. ఆ తర్వాత మహిళ కోర్టులో కేసు వేయగా, కోర్టు మహిళకు మద్దతుగా తీర్పు ఇచ్చింది మరియు జొమాటోకి వేల రూపాయల జరిమానా విధించింది.

శీతల్ అనే మహిళ 31 ఆగస్టు 2023న జొమాటో నుండి మోమోస్‌ని ఆర్డర్ చేసింది. అలాగే గూగుల్ పే ద్వారా రూ. 133.25 చెల్లించారు. ఆర్డర్ ఇచ్చిన 15 నిమిషాల తర్వాత, ఆ మహిళకు తన ఆర్డర్ డెలివరీ అయినట్లు మెసేజ్ వచ్చింది. కానీ ఆమెకు ఆర్డర్ డెలివరీ కాలేదు. దీని తర్వాత ఆ మహిళ జొమాటోకి ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. 72 గంటలు వేచి ఉండవలసి ఉంటుందని జొమాటో సమాధానం ఇచ్చింది. కానీ ఆ తర్వాత కూడా ఎటువంటి సమాధానం రాలేదు. అప్పుడు మహిళ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌కు లీగల్ నోటీసు పంపింది, మొదట జొమాటో తరుపు న్యాయవాది ఆ మహిళ అబద్ధం చెప్పారని కోర్టులో వాదించారు. అయితే ఆ మహిళ తన ఫిర్యాదుకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టులో సమర్పించింది. దీంతో జొమాటో తప్పు రుజువైంది.

ఈ ఏడాది మే 18న శీతల్ తనకు జొమాటో ద్వారా రూ.133.25 రీఫండ్ చేసినట్లు సమాచారం. మానసిక ఒత్తిడికి పరిహారంగా శీతల్‌కు రూ.50,000 చెల్లించాలని, న్యాయపరమైన ఖర్చులకు రూ.10,000 చెల్లించాలని జొమాటోను కోర్టు ఆదేశించడంతో ఆ మొత్తం రూ.60,000కి చేరింది. కేవలం 133 రూపాయలతో పొయ్యేదానిని జొమాటో నిర్లక్ష్యం ద్వారా దాని నిర్లక్ష్యం 60 వేలకు చేరింది.

Also Read: Prabhas : ప్రభాస్ హను మూవీ టైటిల్ అదేనా..!

Follow us