ఆహ్లాదం కోసం గోవా పర్యటనకు వెళ్లాలని భావించే ప్రేమ జంటలు, ముఖ్యంగా తాత్కాలిక ప్రైవేట్ అకామిడేషన్ ఎంచుకునే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తాజా ఘటన తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంది. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఒక బ్లాక్‌మెయిల్ ఉదంతం పర్యటకులను, ముఖ్యంగా ప్రేమ జంటలను షాక్‌కి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన 35 ఏళ్ల మహిళ తన ప్రియుడితో కలిసి గోవాకు పర్యటనకు వెళ్లగా, అక్కడ వారి ప్రయాణ ఏర్పాట్లు, అపార్ట్‌మెంట్లు, హోటళ్ల నిర్వహణ బాధ్యతలు చూసే యశ్వంత్ అనే వ్యక్తి ఆమెను లక్ష్యంగా చేసుకున్నాడు. గోవా ట్రిప్‌లో ఆ మహిళ తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ వీడియోలు మరియు ఫోటోలను రహస్యంగా రికార్డు చేశానని బెదిరిస్తూ, ఆమెకు ఊహించని ఫోన్ కాల్ చేశాడు. తన డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, ఆమె భర్తకు పంపుతానని యశ్వంత్ హెచ్చరించాడు.
Minister Lokesh Dallas Tour : డల్లాస్ వేదికగా జగన్ పరువు తీసిన లోకేష్
ఈ బెదిరింపులతో తీవ్ర భయాందోళనకు గురైన సదరు మహిళ, తన వైవాహిక జీవితం నాశనం అవుతుందని అతడిని బతిమిలాడింది. డబ్బులు అడగవద్దని ప్రాధేయపడినా, ఆ వ్యక్తి తన బెదిరింపులను ఆపలేదు. తనను విడిచిపెట్టాలంటే రూ. 30 లక్షలు ఇవ్వాలని యశ్వంత్ డిమాండ్ చేశాడు. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ మహిళపై మరింత ఒత్తిడి పెంచాడు. దీంతో బాధితురాలు చేసేదేమీ లేక సనత్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన సదరు వ్యక్తిపై బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) యాక్ట్ ప్రకారం వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సనత్ నగర్ పోలీసులు ప్రస్తుతం ఈ గోవా ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను, నిందితుడి ఆచూకీని సేకరిస్తున్నారు.
Nara Lokesh : ‘నా తల్లిని’ అవమానిస్తే నేను వదిలిపెడతానా? – లోకేష్ మరోసారి వార్నింగ్
తాజా ఉదంతం నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లే జంటలకు పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గోవా లేదా ఇతర పర్యాటక ప్రాంతాలలో ప్రైవేట్ బస ఎంపికలు చేసుకునేటప్పుడు, వ్యక్తిగత గోప్యత (Privacy) పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాత్కాలిక వసతి కోసం ఎంచుకునే హోటళ్లు లేదా అపార్ట్‌మెంట్లలో రహస్య కెమెరాలు లేదా రికార్డింగ్ పరికరాలు అమర్చి ఉండవచ్చు అన్న విషయాన్ని గుర్తించి, వాటిని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని హెచ్చరించారు. కేవలం ఎంజాయ్ చేయాలన్న ధ్యాసలో ఉండి, మిమ్మల్ని గమనించి, మీ వ్యక్తిగత క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసే వ్యక్తులు ఉంటారన్న విషయాన్ని పర్యాటక జంటలు ఇకనైనా గుర్తించాలి. తమ పర్యటన సంతోషంగా ముగియాలంటే, అపరిచితులను నమ్మకుండా, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ప్రతి అంశం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన సూచిస్తోంది.
