2.75 Lakhs Per Kg : ఇండియాకు వచ్చిన ప్రపంచంలోనే కాస్ట్లీ మ్యాంగో.. కిలో 2.75 లక్షలే!

2.75 Lakhs Per Kg : మామిడి పండ్లూ.. కిలో రూ. 2.75 లక్షలే!! ఇంత కాస్ట్లీ మామిడి పండ్లను పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో జరిగిన "మ్యాంగో ఫెస్ట్"లో ప్రదర్శించారు.  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిని చూసేందుకు జనం క్యూ కట్టారు..వాటిని సామాన్యులు చూసి ఆనందించడం తప్ప .. కొనగలరా ? 

  • Written By:
  • Updated On - June 11, 2023 / 07:07 AM IST

2.75 Lakhs Per Kg : మామిడి పండ్లూ.. కిలో రూ. 2.75 లక్షలే!!

ఇంత కాస్ట్లీ మామిడి పండ్లను పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో జరిగిన “మ్యాంగో ఫెస్ట్”లో ప్రదర్శించారు.  

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిని చూసేందుకు జనం క్యూ కట్టారు..

వాటిని సామాన్యులు చూసి ఆనందించడం తప్ప .. కొనగలరా ? 

పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో అసోసియేషన్ ఫర్ కన్జర్వేషన్ అండ్ టూరిజం (ACT) సహకారంతో మోడెల్లా కేర్‌టేకర్ సెంటర్ అండ్ స్కూల్ (MCCS) ఈ “మ్యాంగో ఫెస్ట్” ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో 262 రకాల మామిడి పండ్లను  ప్రదర్శించారు. ఈ లిస్టులో అత్యంత ఖరీదైన(2.75 Lakhs Per Kg) జపాన్ మామిడి “మియాజాకి” కూడా ఉంది. ఈ స్టాల్ దగ్గర “మియాజాకి”ప్రత్యేకతలను బోర్డు పై రాసి ప్రదర్శించారు. దాని ప్రకారం.. డయాబెటిస్‌ సమస్య ఉన్నవారు  మియాజాకి తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ నార్మల్‌ అవుతాయి. మియాజాకి మామిడి ఇన్సులిన్‌ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. వేసవిలో ఈ మామిడి తింటే.. రక్తంలో ఇన్సులిన్‌ స్థాయి సాధారణ స్థాయికి చేరుతుంది. మియాజాకి మామిడి ప్రత్యేకమైన వాసన, రుచిని కలిగి ఉంటుంది. ఇందులో కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. మియాజాకి మామిడి తీసుకుంటే.. కేన్సర్‌ రిస్క్‌ను తగ్గిస్తుంది. జింక్, కాల్షియం, విటమిన్లు సి, ఇ, ఎ, కె వంటి పోషకాలు మియాజాకిలో పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి అవసరమైన కాపర్, మెగ్నీషియం వంటి మూలకాలు ఇందులో ఉన్నాయి.

Also read : Sugar Free Mangoes : షుగర్ ఫ్రీ మామిడి పండ్ల గురించి మీకు తెలుసా?

మియాజాకి మామిడి స్టాల్  ఫోటోలతో ANI వార్తా సంస్థ చేసిన పోస్ట్ కు నెటిజన్స్ విశేషంగా స్పందించారు.  “బంగారం మర్చిపో..  నేను ఈ మామిడి పండ్లలో పెట్టుబడి పెడుతున్నాను.. కొన్ని సంవత్సరాలలో నేను మామిడి మార్గరీటాస్‌లో ఈత కొడుతూ ఉష్ణమండల ద్వీపంలో విశ్రాంతి తీసుకుంటాను” అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. “అల్ఫాన్సో మామిడిని జనం ఎల్లప్పుడూ అతిగా అంచనా వేశారు. ‘మియాజాకి’ హైపర్ రేట్ అని నేను భావిస్తున్నాను. రుచి విషయానికొస్తే దశహరి మామిడికి సరిపోయేది లేదు ”అని మరో మామిడి ప్రేమికుడు కామెంట్ పెట్టాడు. మన ఇండియా మామిడి రకాలను ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ జపాన్ మామిడి  మియాజాకితో పోలుస్తూ చాలా మంది వ్యాఖ్యలు చేశారు.