పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ (Congress) తెలంగాణలో అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus Scheme) సౌకర్యం కల్పించింది. ఈ పథకం ద్వారా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని కాంగ్రెస్ భావించింది కానీ ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి తలనొప్పిలే గాని మంచి అనేది ఏ మాత్రం జరగడం లేదు. ఫ్రీ బస్సు అని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫ్రీ అంటే ఎప్పుడోసారి మహిళలు ప్రయాణాలు చేస్తారని అంత అనుకున్నారు..కానీ ఇప్పుడు ఫ్రీ అని చెప్పి మహిళలంతా ప్రతి రోజు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణాలు చేస్తూ వస్తున్నారు. ప్రయాణాలు చేయడం వరకు బాగానే ఉన్న..సీట్ల కోసం కొట్టుకోవడం అందర్నీ నవ్వుకునేలా చేస్తుంది. మొన్నటి వరకు ఆడోళ్ళు అడోళ్ళు కొట్టుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి రాగా…ఇప్పుడు మొగోళ్ళు ఆడోళ్ళు కొట్టుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
CM Chandrababu : వనజీవి రామయ్య మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
తాజాగా వేములవాడ టూ సిద్దిపేట రూట్లో ఓ మహిళా , ఓ మగమనిషి కొట్టుకున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మహిళా అని కూడా చూడకుండా ఆ వ్యక్తి కాలితో తన్నగా…ఆమెకూడా నేనేం తక్కువ అన్నట్లు ఆమెకూడా కాలితో తన్నడం చేసింది. ఇంతలో డ్రైవర్ బస్సు ను పక్కకు ఆపి సదరు వ్యక్తిని కిందకు దింపేసాడు. ఈ గొడవకు ప్రధాన కారణం.. తగినంత బస్సులు అందుబాటులో లేకపోవడమే. రద్దీ సమయాల్లో ప్రత్యేక సర్వీసులు పెంచకపోవడం వల్ల ప్రయాణికులు బస్సుల్లో ఎక్కేందుకు పోటీ పడుతున్నారు. దాంతో ప్రయాణం సురక్షితంగా కాకపోవడమే కాకుండా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఘటనలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనించి, తక్షణమే అదనపు బస్సులు నడపడం, ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజలకు ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ పథకం చివరికి అసౌకర్యానికి దారి తీసే ప్రమాదం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.
ఫ్రీ బస్సులో ఆడోళ్ళు అడోళ్ళు కొట్టుకునేది చూశారు. ఇప్పుడు మొగోళ్ళు ఆడోళ్ళు కొట్టుకునేది చూస్తున్నారు ,
ప్రయాణికులకు తగినన్ని బస్సులు లేవు pic.twitter.com/u4rfg4qXWc— 000009 (@ui000009) April 12, 2025