Beard : గడ్డం నచ్చలేదని..భర్తను వదిలి మరిదితో లేచిపోయిన భార్య

Beard : భర్త గడ్డం నచ్చలేదని మరిదితో లేచిపోయిన ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది

Published By: HashtagU Telugu Desk
Meerut Woman Elopes With Br

Meerut Woman Elopes With Br

ఇటీవల రోజుల్లో పెళ్లికి , భర్త కు కొంతమంది మహిళలు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదు. చిన్న చిన్న వాటికే భర్తలను వదిలి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. తాజాగా భర్త గడ్డం నచ్చలేదని మరిదితో లేచిపోయిన ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. లిసాడి గేట్ ప్రాంతానికి చెందిన మౌలానా షకీర్ అనే యువకుడికి ఆరు నెలల క్రితం ఆర్షి అనే యువతితో వివాహం జరిగింది. 12వ తరగతి వరకు చదివిన ఆర్షి ప్రస్తుతం కళాశాలలో చదువుతోంది. అయితే పెళ్లి అయిన మొదటి రోజునుంచే ఆర్షికి భర్త గడ్డం మీద అభ్యంతరం మొదలైంది. గడ్డం తీసేయమని ఆమె కోరినప్పటికీ, షకీర్ తన మతపరమైన నమ్మకాలతో గడ్డం తీయనని తేల్చి చెప్పాడు. దీని వల్ల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

Caste Census : కుల గణన అంటే ఏమిటి ? ఎవరికి లాభం ?

ఈ పరిస్థితుల్లో షకీర్ చిన్ననాటి నుంచి పెంచుకున్న గడ్డాన్ని వదులుకోలేకపోయాడు. మరోవైపు ఇంట్లో క్లీన్ షేవ్‌తో కనిపించే మరిదిపై ఆర్షికి ఆకర్షణ కలిగింది. భర్త షకీర్ ప్రతిరోజూ ఉదయం పనికి వెళ్లిన తర్వాత ఇంట్లో అత్తమామలతో పాటు మరిది మాత్రమే ఉండేవాడు. ఈ పరిణామాలతో ఆమె మరిదితో దగ్గరైంది. కొంతకాలంగా సంబంధాన్ని కొనసాగించిన ఈ ఇద్దరూ చివరికి ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న షకీర్, ఆర్షి తల్లిదండ్రులకు చెప్పగా, తమ కూతురి చర్యతో విసుగెత్తిన వారు ఆమెతో సంబంధం లేదని ప్రకటించారు.

తన భార్యను మరియు మరిదిని కోల్పోయిన షకీర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. మౌలానా షకీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద సంచలనం రేపుతోంది. చిన్న కారణం అయినా, కుటుంబ బంధాలను తలకిందులు చేసేలా మారిన ఈ సంఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

  Last Updated: 01 May 2025, 10:54 AM IST