Site icon HashtagU Telugu

Wife Master Plan : సెల్ఫీ తీసుదాం అంటూ భర్తను నదిలో తోసిన భార్య..కానీ

Wife Pushes Husband Into Ri

Wife Pushes Husband Into Ri

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. సెల్ఫీ (Selfie) తీసుకుందాం అనే నెపంతో భార్య తన భర్తను నదిలోకి తోసేసిన సంఘటన భయానకంగా మారింది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గుర్జాపూర్ బ్రిడ్జ్ వద్ద (Wife Pushes Husband Into River) జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. బాధితుడు తాతప్ప అనే వ్యక్తి తన భార్యతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ఇది జరిగింది. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం చేగుంట – కడ్లూరు మధ్య ఉన్న కృష్ణా నది బ్రిడ్జి వద్ద భార్య భర్తను “రా బావా.. సెల్ఫీ దిగుదాం” అంటూ బ్రిడ్జి అంచునకి తీసుకెళ్లింది. ఆ వెంటనే తాతప్పను నదిలోకి తోసేసింది.

తాతప్పకు ఈత రాకపోయినా అదృష్టవశాత్తూ ఆ ప్రాంతంలో నది లోతు తక్కువగా ఉండటంతో కొంతదూరం కొట్టుకుపోయాడు. నది మధ్యలో ఉన్న చెట్టు కొమ్మలను పట్టుకుని నిల్చున్నాడు. అనంతరం ఒక పెద్ద రాయిపై కూర్చొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి తాడు సహాయంతో అతడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తాతప్ప చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Central Government Scheme : కేంద్రం మహిళలకు అందిస్తున్న రూ. 5 లక్షల రుణం కోసం ఎలా అప్లై చేయాలంటే !!

తాను ఎలా బతికిపోయాడో వివరించిన తాతప్ప “నా భార్యే నన్ను చంపాలని ప్రయత్నించింది” అని మీడియాతో చెప్పుకొచ్చాడు. అయితే భార్య మాత్రం “తాను తోయలేదని, ఆయన తానే కంట్రోల్ తప్పి పడిపోయారు” అని వాదిస్తోంది. ఈ విషయంలో ఎవరి వాదన నిజమో తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి భార్యాభర్తలిద్దరినీ విచారిస్తున్నారు.

ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. భార్యల చేతుల్లో భర్తలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు పెరుగుతుండడంతో మగవారు పెళ్లికి భయపడే పరిస్థితి ఏర్పడుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకరి మీద ఒకరు అనుమానంతో మోసం, మర్డర్ స్కెచ్‌లకు దిగడం దురదృష్టకరం. బంధం అనే భావనకే మచ్చ తగిలేలా మారిన ఈ ఘటనలు సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.