Huaorani Tribe : కోతులు తింటారు.. ఆకులు కట్టుకుంటారు.. వింత తెగ వివరాలివీ

Huaorani Tribe : అది ప్రపంచంలోనే వింత తెగ. ఆ తెగ వాళ్లు నేటికీ దుస్తులు ధరించరు. ఆకులతో అల్లిన తీగలనే నడుము చుట్టూ కట్టుకుంటారు.

  • Written By:
  • Updated On - November 11, 2023 / 06:12 PM IST

Huaorani Tribe : అది ప్రపంచంలోనే వింత తెగ. ఆ తెగ వాళ్లు నేటికీ దుస్తులు ధరించరు. ఆకులతో అల్లిన తీగలనే నడుము చుట్టూ కట్టుకుంటారు. వాళ్లు అడవి పందులను, కోతులను తింటూ జీవిస్తారు. ఈ వింత తెగ దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌ దేశంలో ఉంది.  ఈక్వెడార్ దేశంలోని అమెజాన్ అడవుల్లో నివసించే మారుమూలన నివసించే ఈ తెగ పేరు  ‘‘హువావోరానీ’’. ఇంతకీ ఇప్పుడే ఈ తెగ గురించి చర్చ మొదలవడానికి ఒక కారణం ఉంది. ట్రావెల్ వీడియోలు చేయడంలో పేరుగాంచిన ప్రముఖ యూట్యూబర్ డేవిడ్ హాఫ్‌మన్ ఈక్వెడార్‌లోని అమెజాన్ అడవుల్లోకి వెళ్లి ఈ తెగవాళ్లను కలిశాడు. అంతేకాదు వాళ్లతో కలిసి 100 గంటలు జీవించాడు. ఈక్రమంలో హువావోరానీ తెగవాళ్ల జీవన స్థితిగతులను చక్కగా రికార్డు చేశాడు.

We’re now on WhatsApp. Click to Join.

యూట్యూబర్ డేవిడ్ హాఫ్‌మన్ గుర్తించిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ తెగవాళ్లు నేటికీ ఆరోగ్య సమస్యల చికిత్స కోసం మొక్కలు, మూలికల కషాయాలనే వాడుతున్నారు. కంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడే వాళ్లకు అక్కడ అందించే చికిత్స ఏమిటో తెలుసా ? .. తల్లి పాలను కంట్లో వేయడం. తల్లి పాలలోని ఔషధ గుణాల వల్ల కంటి ఇన్ఫెక్షన్ తొలగిపోతుందని హువావోరానీ తెగ ప్రజలు నమ్ముతారు. కురారే అనే మొక్క నుంచి తీసే విషాన్ని బాణాలకు రాసి.. వాటితో వేటకు బయలుదేరుతారు. జంతువులు, పక్షులను వేటాడేందుకు ఈ విష బాణాలను ప్రయోగిస్తారు. ఈ విషం చాలా డేంజర్ అని.. దాని ప్రభావంతో మనుషులకు వెంటనే పక్షవాతం వచ్చేస్తుందని తెగకు చెందిన ప్రజలు యూట్యూబర్  డేవిడ్ హాఫ్‌మన్‌కు వివరించారు. ఈ తెగ నుంచి ఎవరు కూడా చదువుకోవడం లేదు. సంస్కృతిని, భూములను కాపాడుకోవడమే ఈ తెగవారి(Huaorani Tribe) ప్రధాన లక్ష్యం.

Also Read: Diwali – Car Safety : దీపావళి రోజు సేఫ్‌గా కారు పార్కింగ్ ఇలా..