Site icon HashtagU Telugu

Nuclear Bomb : అణుబాంబు తీసుకెళ్తే ఏమి చేస్తారు?..అరెస్టయిన ఇద్దరు ప్రయాణికులు

24 Airports

24 Airports

What If I’m Carrying Nuclear Bomb: తాను అణుబాంబు తీసుకెళ్తే ఏం చేస్తారంటూ (What If I’m Carrying Nuclear Bomb) సెక్యూరిటీ సిబ్బందిని ఒక ప్రయాణికుడు ప్రశ్నించాడు. దీంతో ఆ వ్యక్తితోపాటు అతడి వెంట ఉన్న మరో వ్యక్తిని విమానంలోకి అనుమతించలేదు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ(Airport)లో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్‌ 5న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన జిగ్నేష్‌మలానీ, కశ్యప్‌కుమార్‌ లాలానీ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. సెక్యూరిటీ చెకప్‌ తర్వాత ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌ వెళ్లే ఆకాసా ఎయిర్‌ విమానం వద్దకు వెళ్లారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, విమానంలోకి ఎక్కే ముందు లాడర్ పాయింట్ వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిద్దరిని మరోసారి తనిఖీ చేశారు. అయితే తమ చెకింగ్‌ పూర్తయిందని, మళ్లీ తనిఖీ ఎందుకని ఒక వ్యక్తి ప్రశ్నించాడు. డ్యూటీలో ఇది భాగమని, విమానం, అందులోని ప్రయాణికుల భద్రత కోసం బోర్డింగ్‌కు ముందు చెకింగ్‌ అవసరమని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు.

Read Also: AP : జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదు – వైస్ షర్మిల

మరోవైపు ‘నేను అణుబాంబు తీసుకెళ్తే మీరు ఏమి చేస్తారు?’ అని మరో వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో జిగ్నేష్‌మలానీ, కశ్యప్‌కుమార్‌ను విమానం ఎక్కేందుకు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు వారిని అప్పగించారు. దీంతో ఆ ఇద్దరిని అరెస్ట్‌ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.